చైతూ ప్రేమంటే ఇలా ఉంటది మరి!

ఇంతలోనే తన వ్యక్తిగత జీవితంపై కూడా చైతూ ఒక వివరణ ఇచ్చాడు. ఇటీవలే రెండేళ్ల డేటింగ్ తర్వాత నటి శోభిత ధూలిపాళ్లను పెళ్లి చేసుకున్న చైతూ, ఇప్పుడు మరింత హ్యాపీగా ఉన్నాడు.;

Update: 2025-04-28 07:30 GMT

టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా కాంట్రవర్సీ లేకుండా సింపుల్ లైఫ్ లో హడావుడి లేకుండా ఆకట్టుకునే వారిలో నాగచైతన్య ఒకరు. అతనికి కూడా వెంకీ మామ తరహాలోనే పాజిటివ్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే తన సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇటీవల తండేల్ సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు రాబట్టాడంతో అతని నెక్స్ట్ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

నెక్స్ట్ విరుపాక్ష దర్శకుడు కార్తిక్ తో ఒక డిఫరెంట్ అడ్వెంచర్ ఫిల్మ్ చేయనున్నాడు. "ఎన్ సీ24" గా రానున్న ఆ సినిమా మేకింగ్ గ్లింప్స్‌కు వచ్చిన స్పందనతో చైతూ ఫుల్ ఎనర్జీలో ఉన్నాడు. అది చూసి అభిమానులు సినిమాపై భారీ అంచనాలు పెంచుకున్నారు. దీనితో, సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను మరింత ఉత్సాహంగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు.

ఇంతలోనే తన వ్యక్తిగత జీవితంపై కూడా చైతూ ఒక వివరణ ఇచ్చాడు. ఇటీవలే రెండేళ్ల డేటింగ్ తర్వాత నటి శోభిత ధూలిపాళ్లను పెళ్లి చేసుకున్న చైతూ, ఇప్పుడు మరింత హ్యాపీగా ఉన్నాడు. ముఖ్యంగా శోభిత కెరీర్ విషయంలో చైతూ పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. "తెలుగు సినిమాల్లో ఏ ప్రాజెక్ట్ చేస్తుందన్నది పూర్తిగా ఆమె నిర్ణయం. నేను ఎలాంటి పరిమితులు విధించను," అంటూ స్పష్టంగా చెప్పేశాడు.

శోభిత బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించిన విషయం తెలిసిందే. ఇక ఆమె పాత్ర నచ్చితే తన టాలెంట్ తో సినిమాకు ప్రాణం పోయగలదు అని నిరూపించారు. అలాగే కమర్షియల్ యాడ్స్ తో కూడా మెప్పిస్తూ ఉంటారు. ఆమె టాలెంట్ గురించి తెలిసిన చైతూ ఎలాంటి హద్దులు పెట్టలేదు అని క్లారిటీగా అర్ధమవుతుంది. ప్రేమ అనేది ఆపాదింపులు లేకుండా, వ్యక్తిగత అభిరుచులను గౌరవించాలన్నది చైతూ మాటల్లో స్పష్టంగా కనిపించింది.

ఇది నిజమైన ప్రేమకు ప్రతిబింబం అంటున్నారు నెటిజన్లు కూడా. కెరీర్ పరంగా కాదు, జీవనశైలిలో కూడా చైతూ తనదైన స్టైల్‌తో నడుస్తున్నాడు. సినిమా కెరీర్‌తోపాటు హైదరాబాద్‌లో హైఎండ్ క్లౌడ్ కిచెన్ స్టైల్ రెస్టారెంట్‌ను కూడా నిర్వహిస్తున్నాడు. ఫుడ్ పైన ఉన్న ప్రేమతోనే ఈ రంగంలోకి అడుగుపెట్టాడు.

ప్రత్యేకంగా, ప్రతి ఆదివారం తన డైట్ రూల్స్ అన్నీ పక్కన పెట్టి హైదరాబాద్ బిర్యానీ లాంటి ఫేవరెట్ వంటకాలను ఆస్వాదిస్తానని చైతూ చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఏదేమైనా తన జీవితాన్ని బ్యాలెన్స్ చేయడంలో ఒక మంచి ఉదాహరణగా నిలిచాడు. మొత్తం మీద చూస్తే, నాగచైతన్య ఇప్పుడు కెరీర్ పరంగా, వ్యక్తిగత జీవిత పరంగా కూడా మంచి బలమైన దశలో ఉన్నాడు. శోభితతో కలిసి కొత్త జీవితం ప్రారంభించిన చైతూ, సినిమాలతో పాటు జీవితాన్ని కూడా కొత్త ఉత్సాహంతో ఎదుర్కొంటున్నాడు. అభిమానులు మాత్రం "చైతూ ప్రేమంటే ఇలా ఉంటుందని" మురిసిపోతున్నారు.

Tags:    

Similar News