నాగార్జున రూటే కానీ.. నాగ చైతన్య సెపరేటు..!
తాత, తండ్రి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని నటుడిగా తనను తాను మలచుకుంటూ వస్తున్నాడు నాగ చైతన్య.;
అక్కినేని లెగసీ ముందుకు తీసుకెళ్తున్న మూడో తరం హీరో యువ సామ్రాట్ నాగ చైతన్య. తాత, తండ్రి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని నటుడిగా తనను తాను మలచుకుంటూ వస్తున్నాడు నాగ చైతన్య. జోష్ తో మొదలైన ఈ అక్కినేని హీరో కెరీర్ నేటితో 16 ఏళ్లు పూర్తి చేసుకుంది. జోష్ నుంచి తండేల్ వరకు నాగ చైతన్య కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు చేశాడు. తొలి సినిమా జోష్ తోనే స్టూడెంట్ లైఫ్ ని వివరిస్తూ అతను చెప్పిన డైలాగ్ విజిల్స్ వేసేలా చేసింది.
ఇక ఏమాయ చేసావే సినిమాతో రొమాంటిక్ హిట్ అందుకుని అక్కినేని ఫ్యామిలీ రొమాంటిక్ ఇమేజ్ ని కొనసాగించాడు. ఏమాయ చేసావే నుంచి అటు రొమాంటిక్ ఎంటర్టైనర్ లతో పాటు మాస్ కమర్షియల్ సినిమాల్లో కూడా నటించాడు నాగ చైతన్య. ఐతే చైతు కెరీర్ ని టర్న్ తిప్పిన సినిమా మజిలి. సీరియస్ అండ్ ఎమోషనల్ రోల్స్ లో అతని మార్క్ ని చాటుతూ సక్సెస్ అందుకున్నాడు.
లవ్ స్టోరీతో ఇంపాక్ట్..
లవ్ స్టోరీతో కూడా నాగ చైతన్య తన ఇంపాక్ట్ చూపించాడు. ఇక తండేల్ తో తన పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ చేత విజిల్స్ కొట్టించుకున్నాడు. నాగ చైతన్య ఇప్పుడు ఎలాంటి పాత్రలో అయినా చేయగలడు చేస్తాడు అనేలా ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు.
అంతేకాదు చైతు కొన్ని సినిమాల్లో ప్రస్తావించే విషయాలు టెక్నికల్ గా చాలా వాల్యుబుల్ అనిపిస్తాయి. యుద్ధం శరణం సినిమాలో డ్రోన్ కెమెరా చూపించాడు.. ఆ తర్వాత అదే పంథాలో చాలా సినిమాలు వచ్చాయి. ఇక థాంక్యు సినిమాలో ఏఐ ప్రస్తావన చేశాడు. ఏఐ తో హ్యూమన్ హెల్త్ ఇష్యూస్ సాల్వ్ చేసే విషయం గురించి ప్రస్తావించాడు.
తండేల్ లో ఫిషర్ మెన్ లైఫ్ ని చూపించి.. పాకిస్తాన్ వెళ్లిన వాళ్లు ఎలా మళ్లీ ఇండియాకు వచ్చారో ఆ డేర్ నెస్ చూపించాడు. నాగ చైతన్య సవ్యసాచి సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది. ఆ సినిమాలో హ్యాండ్ సిండ్రోం తో కనిపించాడు చైతన్య. ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు కానీ అటెంప్ట్ అందరినీ సర్ ప్రైజ్ చేసింది.
ఫ్యామిలీ లెగసీ కొనసాగించే..
అందరిలా రొటీన్ సినిమాలు చేస్తే స్పెషల్ ఏముంది. కొత్త కథలు.. తమ ఫ్యామిలీ లెగసీని కొనసాగించే కథలను ఎంపిక చేసుకోవడంలో ముందుంటాడు నాగ చైతన్య. తండేల్ తో నటుడిగా మరో పది మెట్లు ఎక్కేసిన నాగ చైతన్య నెక్స్ట్ తన 24వ సినిమా థ్రిల్లర్ జోనర్ లో చేస్తున్నాడు.
విరూపాక్ష సినిమా చేసిన కార్తీక్ దండు డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుంది. సినిమాలే కాదు విక్రం కుమార్ తో నాగ చైతన్య చేసిన ధూత వెబ్ సీరీస్ కూడా ఆడియన్స్ ని అలరించింది. సినిమాల్లో నటిస్తూ వెబ్ సీరీస్ లు చేస్తే మార్కెట్ మీద ఎఫెక్ట్ పడుతుంది లాంటి ఓల్డ్ పరామీటర్స్ ని బ్రేక్ చేస్తూ నాగ చైతన్య ధూత తో అదరగొట్టేశాడు.
నాగార్జున టచ్ చేసిన అన్ని చేస్తూ..
చైతన్య ఫిల్మోగ్రఫీ చూస్తే రొమాంటిక్, యాక్షన్, మాస్, ఎమోషనల్ ఇలా నాగార్జున టచ్ చేసిన అన్ని చేస్తూ తనకంటూ కొత్త పంథా వెతుక్కుంటూ తన మార్గాన్ని తానే వేసుకుంటూ వెళ్తున్నాడు నాగ చైతన్య.
16 ఏళ్ల కెరీర్ లో నటుడిగా ఎన్నో ప్రశంసలు.. సక్సెస్ లు.. ఫెయిల్యూర్స్.. అవార్డులు.. రివార్డులు.. హిట్టు సినిమాలు.. ఫ్లాపైన బొమ్మలు.. జర్నీ మొదలు పెట్టిన టైం లో నాగ చైతన్య ఏం ఆలోచించాడో కానీ తన ప్రతిభతో అక్కినేని వారసుడిగా నట వారసుడిగా ఇంకా మరెన్నో చేయాల్సి ఉందని గుర్తించాడు. తప్పకుండా చేస్తాడు.. నాగ చైతన్య 16 ఏళ్ల కెరీర్ లో సినిమా సినిమాకు బెస్ట్ ఇచ్చుకుంటూ ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వస్తున్నాడు నాగ చైతన్య. కెరీర్ లో అతను ఇంకా చాలా ఎత్తుకి ఎదగాలని ఆశిద్దాం.