ఆ క్రేజీ డైరెక్ట‌ర్ తో సూప‌ర్ స్టార్ సినిమా?

సినీ ఇండ‌స్ట్రీలో ఒక‌రి వ‌ల్ల ఎన్నో ప్రాజెక్టులు లేట‌వుతూ ఉంటాయి. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే కార‌ణంతో ప‌లు సినిమాలు లేట‌వుతున్నాయి.;

Update: 2025-08-25 10:29 GMT

సినీ ఇండ‌స్ట్రీలో ఒక‌రి వ‌ల్ల ఎన్నో ప్రాజెక్టులు లేట‌వుతూ ఉంటాయి. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే కార‌ణంతో ప‌లు సినిమాలు లేట‌వుతున్నాయి. అత‌ను మ‌రెవ‌రో కాదు, ప్ర‌భాస్. డార్లింగ్ లైనప్ లో ప‌లు సినిమాలుండ‌గా అందులో క‌ల్కి2 కూడా ఒక‌టి. గ‌తేడాది నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చి క‌ల్కి2898 ఏడి సినిమా సూప‌ర్ హిట్ గా నిలవ‌డంతో దానికి సీక్వెల్ గా రానున్న క‌ల్కి2 పై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి.

ప్ర‌భాస్ కోసం నాగి ఎదురుచూపులు

ఇప్ప‌టికే డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ క‌ల్కి2 స్క్రిప్ట్ వ‌ర్క్ తో పాటూ ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కూడా పూర్తి చేసుకుని ప్ర‌భాస్ ఎప్పుడంటే అప్పుడు ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ల‌డానికి రెడీగా ఉన్నారు. కానీ ప్ర‌భాస్ డేట్స్ అందుబాటులో లేక‌పోవ‌డం మ‌రియు అత‌నికున్న క‌మిట్‌మెంట్స్ వ‌ల్ల క‌ల్కి2 లేట‌వుతూ వ‌స్తోంది. దీంతో ప్ర‌భాస్ డేట్స్ ఇచ్చేలోపు మ‌రో సినిమాను చేయాల‌ని నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఆలియా భ‌ట్ తో డిస్క‌ష‌న్స్

అందులో భాగంగానే ఆలియా భ‌ట్ కోసం ఓ ఫేమేల్ ఓరియెంటెడ్ స్టోరీని రెడీ చేసి ఆమెతో డిస్క‌ష‌న్స్ చేస్తున్నారు. అయితే ఆలియా భ‌ట్ కూడా వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉండ‌టం వ‌ల్ల ఇప్పుడు నాగ్ అశ్విన్ మ‌రో స్టార్ హీరోతో సినిమా కోసం ట్రై చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే నిర్మాత అశ్వినీద‌త్ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ తో ఓ మీటింగ్ ను ఏర్పాటు చేయ‌గా, రీసెంట్ గా త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ కు నాగ్ అశ్విన్ ఓ ఇంట్రెస్టింగ్ క‌థ‌ను చెప్పార‌ట‌.

అశ్వినీద‌త్ ర‌జినీకాంత్ మ‌ధ్య‌ మంచి అనుబంధం

నాగి చెప్పిన ప్లాట్ సూప‌ర్ స్టార్ కు కూడా న‌చ్చి ఫుల్ స్క్రిప్ట్ తో ర‌మ్మ‌ని చెప్పార‌ని అంటున్నారు. కాబ‌ట్టి అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే వైజ‌యంతీ మూవీస్ ఈ సినిమాను నిర్మించ‌నుంది. నిర్మాత అశ్వినీద‌త్‌తో ర‌జినీకాంత్ కు చాలా మంచి బాండింగ్ ఉంది, వారిద్ద‌రూ క‌లిసి వ‌ర్క్ చేయాల‌ని ఎప్ప‌ట్నుంచో ప్లాన్ చేస్తున్నారు. మ‌రోవైపు ర‌జినీకాంత్ కూడా తెలుగు డైరెక్ట‌ర్ల‌తో ప‌ని చేయాల‌నే ఇంట్రెస్ట్ తో ఇప్ప‌టికే వ‌శిష్ట‌, వివేక్ ఆత్రేయ చెప్పిన క‌థ‌ల‌ను విన్నారు కానీ అవేవీ కార్యరూపం దాల్చ‌లేదు. మ‌రి ఫుల్ నెరేష‌న్ లో నాగ్ అశ్విన్ సూప‌ర్ స్టార్ ను మెప్పిస్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News