ఆలియా చేయ‌లేనిది ప‌ల్ల‌వి చేస్తుందా?

ఇండ‌స్ట్రీలో ఒక‌రు చేయాల్సిన సినిమాలు మ‌రొక‌రి చేతిలోకి వెళ్ల‌డం, ఒక‌రి సినిమాల‌ను మ‌రొక‌రు చేయ‌డం చాలా కామ‌న్.;

Update: 2025-10-03 07:18 GMT

ఇండ‌స్ట్రీలో ఒక‌రు చేయాల్సిన సినిమాలు మ‌రొక‌రి చేతిలోకి వెళ్ల‌డం, ఒక‌రి సినిమాల‌ను మ‌రొక‌రు చేయ‌డం చాలా కామ‌న్. ఇప్ప‌టివ‌ర‌కు అలా ఎన్నో సినిమాలు రాగా, ఇప్పుడు అలా ఒక హీరోయిన్ కోసం అనుకున్న సినిమా మ‌రొక హీరోయిన్ చేతిలోకి వెళ్తున్న‌ట్టు టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాల‌ని ఎప్ప‌ట్నుంచో అనుకుంటున్నార‌నే సంగ‌తి తెలిసిందే.

దీపికా వాకౌట్ తో క‌ల్కి2 మ‌రింత ఆల‌స్యం

ఆ లేడీ ఓరియెంటెడ్ సినిమాను ఆలియా భ‌ట్ తో చేయాల‌ని ఆమెతో డిస్క‌ష‌న్స్ కూడా జ‌రిపారు. ఆలియా కూడా నాగి చెప్పిన క‌థ‌పై ఆస‌క్తిగానే ఉన్నారు. కానీ క‌ల్కి మూవీకి సీక్వెల్ చేయాల‌నే ఆలోచ‌న‌తో నాగి ఆ లేడీ ఓరియెంటెడ్ సినిమాను ప‌క్క‌న పెట్టారు. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగి ఉంటే క‌ల్కి2 ఇప్ప‌టికే సెట్స్ పైకి వెళ్లి ఉండేది. కానీ అనుకోకుండా దీపికా ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకోవ‌డంతో మేక‌ర్స్ ఆమె ప్లేస్ లో ఎవ‌రిని తీసుకోవాలా అని ఆలోచిస్తున్నారు.

లేడీ ఓరియెంటెడ్ మూవీపై నాగి ఫోక‌స్

పైగా ప్ర‌భాస్ కూడా ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉండ‌టంతో క‌ల్కి2 సెట్స్ పైకి వెళ్ల‌డానికి టైమ్ ప‌ట్టేట్టుంది. ఈ నేప‌థ్యంలో నాగ్ అశ్విన్ త‌న దృష్టిని క‌ల్కి2 నుంచి లేడీ ఓరియెంటెడ్ సినిమా వైపు మ‌ర‌ల్చాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆలియాతో చేయాల‌నుకున్న ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాల‌ని నాగ్ ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం.

గ‌త క‌మిట్‌మెంట్స్ తో బిజీగా ఆలియా

కానీ ఆలియా త‌న క‌మిట్‌మెంట్స్ తో చాలా బిజీగా ఉన్నారు. ఆల్రెడీ 2026 మార్చి నుంచి మ‌డోక్ ఫిల్మ్ బ్యాన‌ర్ లో ఛాముండా కోసం బ‌ల్క్ లో డేట్స్ ఇచ్చేయ‌డంతో నాగితో క‌లిసి సినిమా చేయ‌డానికి అవ‌కాశాలు పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. దీంతో ఆ క‌థ‌ను సాయి ప‌ల్ల‌వి తో చేయాల‌ని నాగి ఆలోచిస్తున్నార‌ని తెలుస్తోంది. సాయి ప‌ల్ల‌వికి దేశ‌వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. పైగా ఆమె గొప్ప న‌టి కూడా.

ప్ర‌స్తుతం నితేష్ తివారీ ద‌ర్శ‌క‌త్వంలో బాలీవుడ్ లో రామాయ‌ణ చేస్తున్న సాయి ప‌ల్ల‌వి, రీసెంట్ గానే ఆ సినిమా మొద‌టి భాగం షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. రెండో భాగం షూటింగ్ మొద‌ల‌య్యే వ‌ర‌కు ప‌ల్ల‌వి ఖాళీగానే ఉంటారు. ఆ ఖాళీ టైమ్ ను వినియోగించుకోవాల‌ని నాగి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే సాయి ప‌ల్ల‌వితో నాగి ఆ సినిమాకు సంబంధించిన డిస్క‌ష‌న్స్ చేస్తున్నార‌ని, త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డయ్యే అవ‌కాశ‌ముంద‌ని చెప్తున్నారు. మ‌రి సాయి ప‌ల్ల‌వి ఆ ప్రాజెక్టులో న‌టించ‌డానికి ఒప్పుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News