పిక్‌ టాక్‌ : కవ్విస్తున్న అందాల ఇస్మార్ట్‌ బ్యూటీ

కవ్వించే చూపులతో విభిన్నమైన ఔట్ ఫిట్ లో నెట్టెడ్‌ డ్రెస్ లో థైస్ అందాలను చూపిస్తూ సన్నని నడుము అందాన్ని చూపిస్తున్న నభా నటేష్ అందం కు ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే

Update: 2024-04-27 09:30 GMT

నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నభా నటేష్‌. తెలుగు లో ఈ అమ్మడికి మొదటి సినిమాతోనే అందంతో పాటు నటన విషయంలో మంచి మార్కులు పడ్డాయి. అందుకే వరుసగా ఈ అమ్మడికి ఆఫర్లు తలుపు తట్టాయి.

 

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్‌ హీరోగా రూపొందిన ఇస్మార్ట్‌ శంకర్ సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా హిట్‌ అవ్వడంతో పాటు చాందిని పాత్రలో ఈ అమ్మడు పోషించిన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఆమె బాడీ లాంగ్వేజ్ మరియు డైలాగ్‌ డెలవరీకి అంతా కూడా ఫిదా అయ్యారు.

 

ఇస్మార్ట్‌ శంకర్‌ హిట్‌ తో వరుసగా ఈ అమ్మడు టాలీవుడ్‌ లో సినిమా చేస్తుందని భావిస్తున్న సమయంలో కరోనా కారణంగా ఆమె కెరీర్‌ మళ్లీ ప్రారంభం అయ్యిందా అన్నట్లుగా మారింది. ఈ మధ్య కాలంలో కొత్త సినిమాలు ఏమీ కమిట్ అవ్వని ఈ అమ్మడు త్వరలోనే మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా నభా నటేష్ షేర్‌ చేస్తున్న ఫోటోల జోరు చూస్తూ ఉంటే అతి త్వరలోనే ఈ అమ్మడు వరుసగా సినిమా ఆఫర్లను సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు దక్కితే తన ప్రతిభను చూపించేందుకు రెడీగా ఉన్న నభా నటేష్ తాజాగా ఈ పిక్స్ ను షేర్‌ చేసింది.

కవ్వించే చూపులతో విభిన్నమైన ఔట్ ఫిట్ లో నెట్టెడ్‌ డ్రెస్ లో థైస్ అందాలను చూపిస్తూ సన్నని నడుము అందాన్ని చూపిస్తున్న నభా నటేష్ అందం కు ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అంటూ ఈ ఫోటోలతో మళ్లీ నిరూపితం అయ్యింది.

Tags:    

Similar News