• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుత్తడి బొమ్మగా 'స్వయంభు'...

పుత్తడి బొమ్మగా 'స్వయంభు' యువరాణి!

| ఆ తర్వాత యాక్సిడెంట్ జరిగి ఆపరేషన్ అవ్వడంతో 2021 నుంచి సినిమాలకు దూరంగా ఉంది.

By - Tupaki Desk
Update: 2024-04-09 09:13 GMT

కన్నడ భామ నభా నటేష్.. నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇస్మార్ట్ శంకర్ తో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది ఈ బ్యూటీ. చివరగా నితిన్ మ్యాస్ట్రో సినిమాలో కనిపించింది. ఆ తర్వాత యాక్సిడెంట్ జరిగి ఆపరేషన్ అవ్వడంతో 2021 నుంచి సినిమాలకు దూరంగా ఉంది.

అయితే తనకు యాక్సిడెంట్ అయిన విషయం ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా ఉంచింది నభ. కాస్త రికవర్ అయ్యాక ఈ విషయం చెప్పడంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా కంగారు పడ్డారు. కానీ తాను పూర్తిగా కోలుకున్నట్లు తెలుపుతూ కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు కొత్త పిక్స్ షేర్ చేస్తూ తన ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను అలరిస్తోంది.

ఇప్పుడు టాలీవుడ్ లో మళ్లీ అవకాశాలు దక్కించుకుంటూ మెల్లగా బిజీ అవుతోంది. యంగ్ హీరో నిఖిల్ స్వయంభు తో పాటు ప్రియదర్శితో సినిమా చేస్తోంది. ఇటీవల స్వయంభులో ఆమె నటిస్తున్న విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నభా నటేష్ పీరియాడిక్ గెటప్ లోకి మారి సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన వీడియోను షేర్ చేసి స్వాగతం పలికారు. ఈ మూవీలో ఆమె యువరాణి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

ఇక ఎప్పుడూ మోడ్రన్ గా కనిపించే నభా నటేష్.. తాజాగా పట్టు చీరలో దర్శనమిచ్చింది. ఉగాది స్పెషల్ గా ట్రెడిషనల్ వేర్ లో దిగిన ఫొటోలను షేర్ చేసింది. ఉగాది విషెస్ చెబుతూ తన అందంతో ఆకట్టుకుంటోంది. ఒంటి నిండా నగలు, బ్లూ కలర్ సంప్రదాయ చీరకట్టులో పుత్తడి బొమ్మలా అందరినీ ఫిదా చేస్తోంది. ''మీకు ఉగాది శుభాకాంక్షలు! కొత్త సంవత్సరం ఆరోగ్యం, సంపదతో కలిసి ఉంటుందని ఆశిస్తున్నా'' అని రాసుకొచ్చింది.

ప్రస్తుతం నభా నటేష్ నయా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ అమ్మడి ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తూ ఫ్యాన్స్ కూడా విషెస్ చెబుతున్నారు. అచ్చ తెలుగమ్మాయిలా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు. ట్రెడిషనల్ వేర్ లో అదుర్స్ అంటూ సందడి చేస్తున్నారు. అందాల యువరాణి అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. కొత్త సినిమాలకు గాను ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. మరి నభా నటేష్.. సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలా మెప్పిస్తుందో చూడాలి.

Tags:    
  • Nabhanatesh 
  • Nikhilsiddhartha 
  • Swayambhu 
  • Nabha 
  • Traditionalsaree 
  • Filmindustry 
  • Nabhanateshsaree 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS