చీరలో నభా వయ్యారాలు.. సో బ్యూటీఫుల్!

నభా నటేశ్ నటనపై నమ్మకంతో పాటు, తన ఫిజికల్ లుక్స్‌పైన కూడా బాగా ఫోకస్ పెట్టింది. రెగ్యులర్‌గా జిమ్ చేస్తూ తన ఫిట్‌నెస్‌ను మెయింటైన్ చేస్తోంది.;

Update: 2025-06-09 11:50 GMT

ట్రెడిషనల్ లుక్‌లో నభా నటేశ్ మెరిసిపోయింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోషూట్‌లో ఆమె బంగారు రంగు చీర, ఎర్ర మెరూన్ బ్లౌజ్‌తో చక్కగా అలరిస్తోంది. అరుణోదయ కాంతుల్లో సన్నివేశాలుగా కనిపించే ఈ ఫొటోలు ఇప్పుడు అభిమానుల మనసులను గెలుచుకుంటున్నాయి. రెట్రో టచ్‌తో మిళితమైన ఈ లుక్‌తో నభా అందాలను కొత్తగా ఆవిష్కరించింది.




 


ఓ గది మూలలో కూర్చుని పుస్తకం చదివే ఫోటో, మరోక ఫోటోలో బెడ్‌ పక్కన మెల్లగా తలవంచిన స్టైల్… ఇలా ప్రతి క్షణాన్ని ఒక సంగీత తరంగంలా రూపొందించింది నభా. ఈ ఫొటోలు ఫోటోగ్రాఫీ పరంగానూ, స్టైలింగ్ పరంగానూ కొత్తగా అనిపిస్తున్నాయి. అంతేకాదు, ఈ లుక్‌కి బ్యాగ్‌గ్రౌండ్‌లో ప్లే అయిన ఏఆర్ రెహ్మాన్ సంగీతం కలవలిసి మరింత మాయాజాలంగా చేసింది.




 


నభా నటేశ్ తెలుగులో 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో హిట్ అందుకున్నా, ఆ తరువాత వరుస విజయాల్ని అందుకోలేకపోయింది. ఒకింత గ్యాప్‌ తర్వాత మళ్లీ 'స్వయంభు' సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. 'స్వయంభు'లో నిఖిల్ సరసన యాక్షన్ పీరియాడిక్ డ్రామాలో కనిపించనుంది. ఇక 'డార్లింగ్' మూవీకి సంబంధించి ఇప్పటికే గ్లామర్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.




 


నభా నటేశ్ నటనపై నమ్మకంతో పాటు, తన ఫిజికల్ లుక్స్‌పైన కూడా బాగా ఫోకస్ పెట్టింది. రెగ్యులర్‌గా జిమ్ చేస్తూ తన ఫిట్‌నెస్‌ను మెయింటైన్ చేస్తోంది. అదే సమయంలో ఫోటోషూట్ల ద్వారా సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ముద్ర వేసుకుంటోంది. తాజాగా వచ్చిన ఈ ట్రెడిషనల్ సిరీస్ కూడా ఆమె ఇమేజ్‌కి కొత్త అర్థం చేకూర్చేలా మారింది.




 


ఈ ఫోటోలపై అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ట్రెడిషనల్ లుక్స్‌లోనూ ఎంత అందంగా కనిపించవచ్చో నభా మరోసారి నిరూపించిందంటూ, అభిమానుల నుంచి మెచ్చుకునే కామెంట్స్ వినిపిస్తున్నాయి.



Tags:    

Similar News