మెకానిక్ షెడ్ లో అందాల ప్రదర్శన.. చోటు దొరకలేదా అంటూ?
ఈ క్రమంలోనే తాజాగా నభా నటేష్ ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసిన కుర్రాళ్ళు సైతం ఆశ్చర్యం వ్యక్తం. కార్ గ్యారేజీలో కార్ రిపేర్ చేస్తున్నట్టు ఫోటోలకు ఫోజులిస్తూ అందాల జాతర చేస్తోంది.;
సుధీర్ బాబు హీరోగా నటించిన నన్ను దోచుకుందువటే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ నబా నటేష్. ఆ తర్వాత అదిగో సినిమాలో నటించినా సక్సెస్ కాలేదు. కానీ హీరో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ పాపులర్ సంపాదించుకుంది హీరోయిన్ నబా నటేష్.
తర్వాత అల్లుడు శీను, మాస్ట్రో, ప్రియదర్శి మూవీ డార్లింగ్ వంటి చిత్రాలలో నటించి పరవాలేదు అనిపించుకుంది. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటిస్తున్న స్వయంభూ సినిమాలో నటిస్తున్న ఈమె మరొకవైపు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో ఆకట్టుకుంటోంది.
ఈ క్రమంలోనే తాజాగా నభా నటేష్ ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసిన కుర్రాళ్ళు సైతం ఆశ్చర్యం వ్యక్తం. కార్ గ్యారేజీలో కార్ రిపేర్ చేస్తున్నట్టు ఫోటోలకు ఫోజులిస్తూ అందాల జాతర చేస్తోంది. అలాగే తన ఒంటికి ఆయిల్ , గ్రీస్ రాసుకొని మరి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు షేర్ చేస్తూ.. "మీ హృదయానికి మెకానిక్ ని అవుతాను.. కానీ క్షమించండి.. వారెంటీ ఇవ్వలేను" అంటూ.. క్యాప్షన్ జోడించింది.
క్యాప్షన్ సంగతేమో కానీ ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ మాత్రం కార్ గ్యారేజ్ లో మెకానిక్ లా మారిపోయింది.. అందాలు ప్రదర్శించడానికి వేరే చోటే దొరకలేదా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.ఈ ఫోటోలు చూసిన మరికొంతమంది నెటిజన్స్ సైతం నభా నటేష్ కి అవకాశాలు లేక ఇలాంటి పనులు చేస్తోందా అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తూ ఉండగా.. మరి కొంతమంది ఫైర్, హార్ట్ ఎమోజీ లతో కామెంట్ చేస్తున్నారు.
నభా నటేష్ విషయానికి వస్తే.. అనుకోకుండా 2022లో జారీ కింద పడడంతో భుజానికి గాయం అయింది. ఆ భుజం ఎముకలో పగుళ్లు ఏర్పడడంతో శస్త్రచికిత్స చేశారట. కానీ సినిమాలలో బిజీగా ఉండడం వల్ల దానిని ఆమె నిర్లక్ష్యం చేయడంతో మరొకసారి శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది అని..అలా కోలుకోవడానికి దాదాపు సంవత్సర సమయం పట్టిందని సమాచారం. ఈ ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత స్వయంభు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నభా నటేష్.
ప్రస్తుతం నభా నటేష్ నటిస్తున్న సినిమా విషయానికి వస్తే.. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో ఈమె ఒక చారిత్రక పాత్ర పోషిస్తున్నట్లు చిత్ర బృందం ఫస్ట్ లుక్ తో సహా ఆమె క్యారెక్టర్ ను రివీల్ చేసింది . భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమా కోసం నిఖిల్ మార్షల్ ఆర్ట్స్ తో పాటు గుర్రపు స్వారీ అలాగే ఆయుధాలను ఎలా ప్రదర్శించాలి అనే విషయాలపై శిక్షణ తీసుకున్నట్లు సమాచారం . ఈ చిత్రాన్ని పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. కే జి ఎఫ్, సలార్ వంటి చిత్రాలకు సంగీతం అందించిన రవి బస్రూర్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు.ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతోంది.