'స్వ‌యంభు' వ‌చ్చే వ‌ర‌కూ న‌భా క‌విత‌లేనా?

చాలా సింపుల్ గా.. చాలా నేచుర‌ల్ గా స‌హ‌జ‌సిద్ధంగా ప్ర‌కృతి అందాల నడుమ ఒదిగిపోయి క‌నిపించింది న‌భా. వైట్ ఫ్రాక్ లో గుబులు రేపేంత అందంగా క‌నిపిస్తోంది.;

Update: 2025-10-30 13:40 GMT

సాయంత్రం వెలుగులో నన్ను వెతుక్కుందాం.. నా ముఖంలో చిరునవ్వుతో, నా హృదయంలో వెచ్చదనంతో.. కూర్చుని ఆకాశ సౌందర్యం గురించి మాట్లాడుకుందాం.. గాలితో ఊపిరి పీల్చుకుందాం.., మేఘాల నీడలో విశ్రాంతి తీసుకుందాం.. సూర్యాస్తమయంలో మారుతున్న రంగుల్లో నవ్వుకుందాం.. ఎప్ప‌టికీ నన్ను వెతుక్కుందాం..





ఎవ‌రిలో ఇంత సొగ‌సైన క‌విత్వం పొంగి పొర్లుతోంది? ఏమో! అది న‌భా న‌టేష్ కావొచ్చు. ఈ క‌న్న‌డ బ్యూటీ టాలీవుడ్ లో అడుగుపెట్టిన‌ప్ప‌టి నుంచి కెరీర్ ప‌రంగా వ‌రుసగా అవ‌కాశాలు అందుకుంటూనే ఉంది. కానీ ఊహించ‌ని విధంగా కెరీర్ దూసుకెళుతున్న స‌మ‌యంలోనే ఒకే ఒక్క యాక్సిడెంట్ త‌న క‌ల‌ల్ని క‌ల్ల‌లు చేసేస్తుంద‌ని భ‌య‌ప‌డిన‌ట్టు చెప్పుకొచ్చింది న‌భా. అప్ప‌ట్లో త‌న కెరీర్ గురించి చాలా ఆందోళ‌న చెందింది. అయితే చూస్తుండ‌గానే అంతా మారిపోయింది. తాను అనుకున్న విధంగా కంబ్యాక్ అయింది. ఇప్పుడు ద‌ర్శ‌క‌నిర్మాత‌లను ఆక‌ర్షించ‌డంలో రేసులో ముందుంది.




 


ఈరోజు ఉన్న‌ది రేపు ఉండ‌దు.. రేపు ఉన్న‌ది ఆ త‌ర్వాత ఉండ‌దు.. ప్ర‌తి రోజూ మారిపోతూనే ఉంటుంది. లైఫ్ అంటే ఇదే కదా.. అయితే కొంచెం ఓపిక స‌హ‌నం అవ‌స‌రం. కాలంతో పాటే మార్పు ఉంటుంద‌ని గ్ర‌హించి స‌హ‌నంతో ఎదురు చూడాలి. ఇప్పుడు తాను వేచి చూసిన సమ‌యం రానే వ‌చ్చింది. తిరిగి ఎప్ప‌టిలానే న‌భా న‌టేష్ త‌న సొగ‌సైన రూపాన్ని తిరిగి పొందింది. బోయ్స్ ని క‌వ్వించే అందం చందం త‌న‌లో మెండుగా ఉన్నాయ‌ని చెప్ప‌క‌నే చెబుతోంది న‌భా ఇన్ స్టాలోని ప్ర‌తి పోస్ట్. ఎంతో అందంగా డిజైన‌ర్ లుక్కుల్లోకి ఒదిగిపోయి ఫోటోషూట్ల‌లో మిల‌మిల మెరిసిపోతోంది న‌భ‌. తాజాగా న‌భా న‌టేష్ షేర్ చేసిన ఓ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది.




 


చాలా సింపుల్ గా.. చాలా నేచుర‌ల్ గా స‌హ‌జ‌సిద్ధంగా ప్ర‌కృతి అందాల నడుమ ఒదిగిపోయి క‌నిపించింది న‌భా. వైట్ ఫ్రాక్ లో గుబులు రేపేంత అందంగా క‌నిపిస్తోంది. మునుప‌టితో పోలిస్తే జిమ్ లో బాగా శ్ర‌మిస్తోంది. దీని ఫ‌లితం న‌భా ఎంతో స్లిమ్ గా టీనేజ‌ర్ ని త‌ల‌పిస్తోంది. ఈ మేకోవ‌ర్ నిజంగా స్ట‌న్నింగ్. హూ ఆర్ యు క్వీన్ న‌భా.. ఐ మిస్ యు! అంటూ ఒక అభిమాని ల‌వ్ ఈమోజీల‌ను షేర్ చేసాడు. చాలా మంది అభిమానులు న‌భా న‌టేష్ అంద‌చందాల‌కు మైమ‌రిచి పోతున్నామ‌ని చెబుతున్నారు. ల‌వ్ కిస్ ఫైర్ ఈమోజీల‌తో ఫ్యాన్స్ విరుచుకుప‌డుతున్నారు. తాజా ఫోటోషూట్ వెబ్‌లో మోంతా తుఫాన్ లా దూసుకెళుతోంది.


కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. నిఖిల్ స‌ర‌స‌న `స్వ‌యంభు` అనే హిస్టారిక‌ల్ వారియ‌ర్ డ్రామా చిత్రంలో న‌టిస్తోంది. భ‌ర‌త్ కృష్ణ‌మాచారి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాపై న‌భా చాలా హోప్స్ పెట్టుకుంది. కొంత గ్యాప్ త‌ర్వాత త‌న‌కు బిగ్ బ్రేక్ ఇస్తుంద‌ని న‌భా ఆశిస్తోంది. న‌భాతో పాటు, సంయుక్త మీన‌న్ మ‌రో క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

Tags:    

Similar News