'కపుల్ ఫ్రెండ్లీ' ఫస్ట్ సింగిల్.. కెమిస్ట్రీ అంటే అలా ఉండాలేమో!

టాలీవుడ్ యువ నటీనటులు సంతోష్ శోభన్, మానస వారణాసి లీడ్ రోల్స్ లో కపుల్ ఫ్రెండ్లీ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2026-01-08 10:45 GMT

టాలీవుడ్ యువ నటీనటులు సంతోష్ శోభన్, మానస వారణాసి లీడ్ రోల్స్ లో కపుల్ ఫ్రెండ్లీ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. చెన్నై బ్యాక్ డ్రాప్ తో యూత్‌ కు కనెక్ట్ అయ్యే స్టోరీ, మోడ్రన్ రిలేషన్‌ షిప్ టచ్‌ తో రూపొందిస్తోంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

సినిమా నుంచి ఇప్పటి వరకు మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్.. మంచి రెస్పాన్స్ అందుకుంది. టీజర్, గ్లింప్స్, పోస్టర్స్ అన్నీ ఆడియన్స్ ను తెగ ఆకట్టుకున్నాయి. లవ్, ఫన్, ఎమోషన్ మేళవింపుతో ఉన్న విజువల్స్.. సినిమాపై ఆడియన్స్ లో సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. దీంతో మూవీ క్లిక్ అవుతుందని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే సమయంలో రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14వ తేదీ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అయితే విడుదలకు ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉండగా.. మేకర్స్ తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. నిజానికి సినిమాకు ఆదిత్య రవీంద్రన్ అందిస్తున్న పాటలు, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తుండగా.. ఇప్పుడు మేకర్స్ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు.

కూల్ క్లైమేట్ కు కొంత రొమాన్స్ ఉంటుందంటూ రాసుకొచ్చారు. నాలో నేను సాంగ్ ను ఆదిత్య రవీంద్రన్ స్వరపరచగా.. సంజిత్ హెగ్డే ఆలపించారు. లిరిక్స్ ను సరస్వతీ పుత్ర రామ జోగయ్య శాస్త్రి అందించారు. అయితే ఫస్ట్ సింగిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. అందరినీ ఆకట్టుకుంటూ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. సాంగ్ చాలా బాగుందని మ్యూజిక్ లవర్స్ కామెంట్లు పెడుతున్నారు.

రొమాంటిక్ మెలోడీగా అలరిస్తున్న నాలో నేను సాంగ్ కు రామ జోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ సూపర్ గా ఉన్నాయి. సంజిత్ హెగ్డే తన గాత్రంతో ప్రాణం పోశారు. ఆయన వాయిస్.. సాంగ్ కు హైలెట్ ముఖ్యంగా ఆదిత్య రవీంద్రన్.. వింటే వింటూనే ఉండాలనిపించే ట్యూన్ తో కంపేజ్ చేశారు. ఫస్ట్ సింగిల్ ను ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచేలా చేశారు. మ్యూజిక్ లవర్స్ ఫేవరెట్ లిస్ట్ లోకి అప్పుడే చేరిపోయింది ఆ సాంగ్.

అదే సమయంలో సాంగ్ లో సంతోష్ శోభన్, మానస వారణాసి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. ఇద్దరి జంట పెర్ఫెక్ట్ గా సెట్ అయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కెమెస్ట్రీ చూడ ముచ్చటగా అనిపించిందని అంటున్నారు. మొత్తానికి తొలి పాట ఇప్పుడు అందరినీ మెప్పిస్తోంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.


Full View


Tags:    

Similar News