32 వరకూ పెళ్లాడకపోతే కనీసం ఒక విడాకులు స్కిప్ కొట్టినట్టే: యువహీరో
యువహీరో ఆలోచనలో ఒక రకమైన ప్రాక్టికాలిటీ కనిపిస్తుంది. 20 ఏళ్లలో ఉండే ఆవేశం, ఆలోచనలు 30 ఏళ్లకు వచ్చేసరికి మారతాయి.;
ప్రముఖ యువహీరో రొమాన్స్ లో ఆరితేరిపోయాడు. కథానాయికలతో డేటింగుల్లోను జోరుమీదున్నాడు. ఆప్ ద స్క్రీన్ రోమాంచిత జీవితంలో తలమునకలుగా ఉన్నాడు. అంతేకాదు.. వెండి తెరపై పెళ్లయిన హీరోయిన్లతో .. అందమైన యువ హీరోయిన్లతో ఘాటైన రొమాన్స్ చేస్తున్నాడు...లిప్ లాక్ లు, బెడ్ రూమ్ సీన్లలో జీవించేస్తాడు. అయితే అతడి వయసు 32 ప్లస్ లో ఉన్నా ఇంకా పెళ్లికి దూరంగానే ఉన్నాడు. ఇంట్లో ఒత్తిడి ఉన్నా చేసుకోవడం లేదు మరి! అయితే పెళ్లి గురించి అతడు చేసిన ఓ కామెంట్ ఇప్పుడు యువతుల్లో పెద్ద చర్చకు తెర తీసింది. ఇంతకీ అతడు పెళ్లి గురించి ఏమన్నాడు? అంటే...
యువతీయువకులు 32 వయసు వరకూ పెళ్లాడకపోతే జీవితంలో కనీసం ఒక విడాకులు అయినా స్కిప్ కొట్టినట్టేనని అన్నాడు. అయితే అతడి మైండ్ సెట్ సరైనదేనా? పాతికలో పెళ్లాడకపోతే వచ్చే నష్టం కంటే 32 వరకూ పెళ్లాడకపోతే కలిగే ప్రయోజనాలే ఎక్కువా? అంటే... విశ్లేషణ ఇలా ఉంది.
యువహీరో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హా*ట్ డిబేట్ కి తెర తీసాయి. 32 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోకపోతే కనీసం ఒక విడాకులను అయినా స్కిప్ చేసినట్టే అనడంలో అతడి ఉద్దేశ్యం.. తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకుని బాధపడేకంటే.. పరిణతి వచ్చాక సరైన భాగస్వామిని ఎంచుకోవడం మేలని.
ఆ మైండ్ సెట్ సరైనదేనా?
యువహీరో ఆలోచనలో ఒక రకమైన ప్రాక్టికాలిటీ కనిపిస్తుంది. 20 ఏళ్లలో ఉండే ఆవేశం, ఆలోచనలు 30 ఏళ్లకు వచ్చేసరికి మారతాయి. ఆర్థిక స్థిరత్వం కూడా 30 ఏళ్ల వయసులోనే పాజిబుల్ కదా! కెరీర్ పరంగా ఒక సెటిల్మెంట్ ఉంటుంది. మానసిక పరిణతి ఉంటుంది. ఎదుటివారిని అర్థం చేసుకునే గుణం, సహనం ఈ వయసులో ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. చిన్న వయసులో పెళ్లి చేసుకున్న వారితో పోలిస్తే, 28-32 ఏళ్ల మధ్య పెళ్లి చేసుకునే వారిలో విడాకుల రేటు కొంత తక్కువగా ఉంటుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.
రీల్ లైఫ్ వర్సెస్ రియల్ లైఫ్
సినిమా తెరపై హీరోయిన్లతో రొమాన్స్ చేయడం అనేది అతడి వృత్తి. ఒక నటుడిగా గ్లామర్ ప్రపంచంలో ఉంటూ, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆచితూచి అడుగు వేయడం అతని వ్యక్తిగత విచక్షణ. రొమాంటిక్ సీన్స్‌లో నటించినంత మాత్రాన.. నిజ జీవితంలో కూడా అంతే వేగంగా రిలేషన్ షిప్స్‌లోకి వెళ్లాలని లేదు.
సమాజం మారుతోంది
ఒకప్పుడు 25 దాటితే పెళ్లి ఎప్పుడు అని అడిగేవారు. కానీ ఇప్పుడు స్వయంప్రతిపత్తి ముఖ్యం. యువత తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాకే సంసార జీవితంలోకి అడుగుపెట్టాలని కోరుకుంటున్నారు. ఇది భయం కాదు.. బాధ్యత. పెళ్లి అంటే భయం కంటే ఆ బాధ్యతను మోయగలమా లేదా అనే ఆలోచన పెరిగింది.
వయసు అనేది కేవలం అంకె మాత్రమే. 22 ఏళ్లకే పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నవారు ఉన్నారు.. 35 ఏళ్లకు చేసుకుని ఇబ్బంది పడేవారు ఉన్నారు. సిద్ధాంత్ చెప్పినట్టు `తప్పుడు పెళ్లి` కంటే `లేట్ పెళ్లి` మేలు అనేది వాస్తవమే అయినా.. అది కేవలం వయసు మీద మాత్రమే కాకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. యువతీయువకుల్లో పరిణతి చాలా ముఖ్యం. దీనిని బట్టి లేట్ పెళ్లి సరైనదేనని పెళ్లి కాని ప్రసాదులు ఉబలాటపడనవసరం లేదు!! 40 దాటినా ఇంకా పెళ్లి కాని హీరోలు కూడా ఉన్నారు.. వారిని ఆదర్శంగా తీసుకుంటే కష్టమే!