• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మైత్రి దర్శక బలం.....

మైత్రి దర్శక బలం.. పవర్ఫుల్ పిక్

| అయితే అందులో యువ దర్శకులు సీనియర్ దర్శకులు స్టార్ దర్శకులు సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోను దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

By - Tupaki Desk
Update: 2023-11-21 13:49 GMT

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకులకు ఉన్నంత డిమాండ్ ఎవరికి లేదు అని చెప్పాలి. ఎందుకంటే మంచి సినిమాలు చేస్తూ సక్సెస్ ట్రాక్ ను కొనసాగించడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఇక అలాంటి దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నా ఇండస్ట్రీలో నిర్మాతల నుంచి ఆఫర్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి వాళ్లు ఒక కాంపౌండ్ లో కుదురుగా ఉండకపోవచ్చు.

కానీ మైత్రి మూవీ మేకర్స్ మాత్రం ఇండస్ట్రీలో ఉన్న సక్సెస్ఫుల్ దర్శకులందరిని కూడా తన వైపుకు తిప్పుకుంటోంది అని చెప్పాలి. ప్రస్తుతం ఈ కాంపౌండ్ లో పదిమందికి పైగా టాలెంటెడ్ దర్శకులు సినిమాలు చేస్తున్నారు. మరి కొంతమంది భవిష్యత్తులో కూడా ప్రాజెక్టులను స్టార్ట్ చేయబోతున్నారు.

ఇక రీసెంట్ గా మైత్రి నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేని పుట్టినరోజు సందర్భంగా కొంతమంది సినీ ప్రముఖులకు పార్టీ ఇచ్చారు. అయితే అందులో యువ దర్శకులు సీనియర్ దర్శకులు స్టార్ దర్శకులు సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోను దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

ఇక ఫోటోలో అయితే సుకుమార్ తో పాటు గోపీచంద్ మలినేని బుచ్చిబాబు, హను రాగవపూడి, హరీష్ శంకర్, వెంకీ కుడుముల రాహుల్ సంకీర్తన కనిపించారు. వీరందరూ కూడా ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ లోనే సినిమాలు చేస్తూ ఉన్నారు. మరికొందరు త్వరలో కొత్త ప్రాజెక్టులకు కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ ను మొదట ఇండస్ట్రీకి పరిచయం చేసింది మాత్రం కొరటాల శివనే.

ఆయన దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు సినిమాతోనే ఈ సంస్థ భారీ విజయాన్ని అందుకొని ఆ తర్వాత ఎంతో విజయవంతంగా సినిమాలను నిర్మిస్తోంది. కేవలం సక్సెస్ ట్రాక్లో ఉన్న దర్శకులను మాత్రమే కాకుండా కొత్తవారికి కూడా అవకాశాలు కల్పిస్తున్న ఈ నిర్మాణ సంస్థ కోసం ఎక్కువగా కాంబినేషన్స్ కు నమ్ముకుంటోంది. ఇక ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఆ సినిమా కోసం 350 కోట్ల భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్నారట. అల్లు అర్జున్ పుష్ప సెకండ్ పార్ట్ కోసం అంతకుమించి అనేలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాడు. ఇక ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానుంది.

Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • Mythrimoviemakers 
  • Naveenyerneni 
  • Birthday 
  • Directiors 
  • Viralpic 
  • Sukumar 
  • Harishshankar 

Similar News

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

2026-11-07 08:51 GMT

సినిమా ప్రొడక్షన్‌లో ఎగ్జిక్యూటివ్ నిర్మాత పాత్ర ప‌రిధి ఎంత‌?

2026-11-07 08:25 GMT

రాహా బర్త్‌డే స్పెషల్.. చిక్ లుక్‌తో ఆకట్టుకున్న అలియా భట్!

2026-11-07 08:23 GMT

నటుడిగా చివరి దశాబ్దం.. డైరెక్టర్ గా స్టార్ హీరో!

2026-11-07 08:22 GMT

Bigg Boss Telugu 10: ఈసారైనా జబర్దస్త్ నరేష్ దొరికిపోతాడా?

2026-11-07 08:20 GMT

చిరు 'లీక్స్' కాదు.. ఇప్పుడు ఫుల్ క్లారిటీ అవసరం!

2026-11-07 06:50 GMT

43 ఏళ్లలో కూడా తరగని అందం.. నెట్ సారీలో త్రిష అందాలు!

2026-11-07 06:47 GMT

Tupaki Exclusive : నాగార్జున ఎందుకు ప్రెజెంట్ చేశారు? అనీష్ ఓపెన్ చాట్

2026-11-07 06:12 GMT

Copyright @2026

Powered by Blink CMS