మైత్రి గేమ్ ప్లాన్ రివీల్ చేసిన డైరెక్టర్.. కాదనలేని సూట్ కేస్ అంటూ..!

మైత్రి నవీన్, రవి శంకర్ లు సినిమా మీద ఉన్న ప్యాషన్ తో వారు చేస్తున్న ప్రాజెక్ట్స్, కలుపుతున్న కాంబినేషన్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తున్నాయి.;

Update: 2025-10-16 07:13 GMT

టాలీవుడ్ లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరితో సినిమాలు చేస్తూ బ్యానర్ రేంజ్ ని కేవలం సౌత్ లోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో కూడా ఇంపాక్ట్ కలిగేలా చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. మైత్రి నవీన్, రవి శంకర్ లు సినిమా మీద ఉన్న ప్యాషన్ తో వారు చేస్తున్న ప్రాజెక్ట్స్, కలుపుతున్న కాంబినేషన్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ సినిమా అంటే డెఫినెట్ గా అది ఒక రేంజ్ గ్యారెంటీ అనే విధంగా వాళ్లు సినిమాలు సిద్ధం చేస్తున్నారు.

ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్స్ తో..

టాలీవుడ్ లో అటు ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్స్ తో పాటుగా రాం, విజయ్ దేవరకొండ, నాని లాంటి స్టార్స్ తో సినిమాలు చేస్తున్నారు. లేటెస్ట్ గా ప్రదీప్ రంగనాథన్ తో డ్యూడ్ సినిమా చేసిన మైత్రి మేకర్స్ ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రస్తుతం తమ బ్యానర్ లో చేస్తున్న డైరెక్టర్స్ ని ఈవెంట్ కి తీసుకొచ్చారు. ఈ ఈవెంట్ లో బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ మైత్రి సంస్థ సినిమాల ప్లానింగ్ గురించి చెప్పాడు.

హిట్ సినిమా చేస్తే మైత్రి ఆఫర్ వస్తుంది. వాళ్లు కాదనలేని సూట్ కేస్ తో వస్తారని అన్నాడు సాయి రాజేష్. సో హిట్ డైరెక్టర్స్ ని వాళ్లు ఎలా పిక్ చేసుకుంటున్నారో సాయి రాజేష్ హింట్ ఇచ్చాడు. ఇదే క్రమంలో ప్రదీప్ రంగనాథన్ గురించి సాయి రాజేష్ క్రేజీ కామెంట్స్ చేశాడు. హీరో అంటే హీరోల్లా కాదు మనలా ఉంటే చాలు.. మీలో మమ్మల్ని చూసుకుంటున్నాం. డ్రాగన్ సినిమా చూసి చాలా ఎమోషనల్ అయ్యాం. త్వరలోనే తెలుగు పీపుల్ మిమ్మల్ని అడాప్ట్ చేసుకుంటారు. మీరు తెలుగు అడాప్టెడ్ సన్ అవుతారు. మీరు స్ట్రైట్ తెలుగు సినిమాలు చేయాలని అన్నాడు సాయి రాజేష్.

డైరెక్టర్ కి సూట్ కేస్ పంపించి ఆఫర్..

ఇక ఇదే ఈవెంట్ లో బుచ్చి బాబు కూడా మైత్రి నిర్మాతల గురించి చెప్పాడు. అందరు డైరెక్టర్స్ గా ఆ బ్యానర్ లో చేశారు. కానీ ఈ బ్యానర్ లో రంగస్థలం సినిమాకు ఏడీ గా కూడా చేశానని అన్నారు. అంతేకాదు నేను, వైష్ణవ్, కృతి అంతా కొత్త వారైనా సరే ఉప్పెన బడ్జెట్ విషయంలో ఎక్కడ తగ్గలేదని అన్నాడు. మైత్రి నిర్మాతలు కాంబినేషన్ సెట్ చేయడమే కాదు. కంటెంట్ ఉన్న సినిమాలను కూడా చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఓ పక్క కమర్షియల్ సినిమాలతో పాన్ ఇండియా షేక్ చేసే ప్రాజెక్ట్ లు చేస్తూ మరోపక్క యంగ్ అండ్ డైనమిక్ యువ హీరోలతో తమ బ్రాండ్ ని నిలబెట్టే సినిమాలు చేస్తున్నారు.

టాలీవుడ్ లో ప్రస్తుతం దాదాపు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ సినిమాలే 10 దాకా ఉన్నాయని చెప్పొచ్చు. సాయి రాజేష్ చెప్పినట్టుగానే హిట్ కొట్టిన డైరెక్టర్ కి సూట్ కేస్ పంపించి ఆఫర్ ఇస్తారని చెప్పి వాళ్ల గేమ్ ప్లాన్ ని రివీల్ చేశాడు.

Tags:    

Similar News