స్టార్ డైరెక్టర్ గ్యాప్ మిస్టరీ వీడిందిలా!
స్టార్ డైరెక్టర్ మురగదాస్ `దర్బార్` ప్లాప్ తర్వాత ఐదేళ్లు ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎలాంటి సినిమా చేయకుండా ఇంటికే పరిమితయ్యారు.;
స్టార్ డైరెక్టర్ మురగదాస్ `దర్బార్` ప్లాప్ తర్వాత ఐదేళ్లు ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎలాంటి సినిమా చేయకుండా ఇంటికే పరిమితయ్యారు. ఈ సమయంలో మురగదాస్ పేరు ఇండస్ట్రీలో కూడా ఎక్కడా వినిపించలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ కు `దర్బార్` రూపంలో ఘోర పరాజయాన్ని అందిం చారు అన్న విమర్శలు తీవ్ర స్థాయిలో ఎదుర్కున్నారు. అప్పటికే `సర్కార్` తో బ్లాక్ బస్టర్ అందుకుని దర్బార్ ని తెరకెక్కించారు. దీంతో భారీ అంచనాల మధ్య విడుదలైన ఘోర పరాజయం చెందింది.
యానిమేషన్ చిత్రం కారణంగా:
అప్పటి నుంచి మురగదాస్ పేరు ఇండస్ట్రీలో వినిపించలేదు. ఈ నేపథ్యంలో ప్లాప్ కారణంగానే ఆయన దూరంగా ఉన్నారు? అనే చర్చ సాగింది. రజనీకాంత్ కు మరో హిట్ ఇచ్చే వరకూ ఆయన జనసమూహంలోకి రానని ఒట్టు పెట్టుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ గ్యాప్ కు గల అసలు కారణాలను మురగదాస్ బయట పెట్టారు. `దర్బార్` తర్వాత ఆయన ఇండస్ట్రీకి దూరం కాలేదన్నారు. అదే పరిశ్రమలో ఉంటూ ఐదేళ్ల పాటు ఓ యానిమేషన్ చిత్రానికి పని చేసానన్నారు.
ఐదేళ్ల తర్వాత అదే పరిస్థితి:
అయితే ఆ సినిమా కార్యరూపం దాల్చలేదన్నారు. ఆ కారణంగానే చాలా సమయం వృద్ధాగా పోయిం దన్నారు. టెక్నీషియన్ గా తానెప్పుడు ఖాళీగా లేనని..నిరంతరం ఎదో పనిలో బిజీగానే ఉన్నానన్నారు. అదీ మురగదాస్ ఐదేళ్ల గ్యాప్ కి అసలు కారణం. ఒకవేళ యానిమేషన్ చిత్రంతో గనుక మురగదాస్ ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్ అయితే అది వేరే లెవల్లో ఉండేది. రాకపోవడంతోనే అన్నిరకాల విమర్శలు ఎదుర్కున్నారు. అయితే ఐదేళ్ల తర్వాత చేసిన సినిమా రూపంలో కూడా అంతే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఈ సినిమాతో నైనా హిట్ కొట్టేనా:
సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన `సికిందర్` భారీ అంచనాల మధ్య విడుదలై ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. మురగదాస్ నుంచి ఏమాత్రం ఊహించని కంటెంట్ ఇది. సోలష్ మీడియాలో ట్రోలింగ్ కి కూడా గురైందంటే? పరిస్థితి అద్దం పడుతుంది. వీటన్నింటికి బధులు చెప్పడానికి `మదరాసీ`తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. శివ కార్తికేయన్ హీరోగా నటించిన సినిమా మరికొన్ని గంటల్లోనే రిలీజ్ అవుతుంది.