• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మురుగ‌దాస్ తో అంత‌కు...

మురుగ‌దాస్ తో అంత‌కు మించి ప్లాన్ చేస్తున్నారా?

| స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ముర‌గ‌దాస్ మ‌రోసారి బాలీవుడ్ కి వెళ్ల‌బోతున్నాడు అన్న వార్త వైర‌ల్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-03-11 07:55 GMT

'ద‌ర్బార్' ప్లాప్ త‌ర్వాత ముర‌గ‌దాస్ మూడ‌ళ్ల పాటు మేకింగ్ కి దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే శివ కార్తికేయ‌న్ హీరోగా ఓ కొత్త సినిమా ప‌ట్టాలెక్కించారు. మ‌రి ఇంత గ్యాప్ ఎందుకిచ్చాడు? శివ కార్తికేయ‌న్ లాంటి టైర్-2 హీరోతో సినిమా చేయాల్సిన ప‌రిస్థితులు ఏంటి? అన్న దానిపై ఇప్ప‌టికీ చ‌ర్చ సాగుతూనే ఉంది. హీరోలంతా ఇత‌ర ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉండ‌టం వ‌ల్ల డేట్లు స‌ర్దుబాటు కాలేదా? లేక వాళ్ల‌కు దూరంగా ముర‌గ‌దాస్ ఉన్నాడా? లేక స్టార్ హీరోల్ని మెప్పించే క‌థ‌లు లేక‌నా? అన్న‌ది తెలియ‌దుగానీ.. ముర‌గ‌దాస్ ప్రాజెక్ట్ తో శివ కార్తికేయ‌న్ మాత్రం మ‌రింత ఫేమ‌స్ అవుతున్నాడు.

అత‌డిలో న‌టుడ్ని గుర్తించి ముర‌గ‌దాస్ అవకాశం ఇవ్వ‌డం ప‌ట్ల ఎంతో సంతోషంగా ఉన్నాడు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ముర‌గ‌దాస్ మ‌రోసారి బాలీవుడ్ కి వెళ్ల‌బోతున్నాడు అన్న వార్త వైర‌ల్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. స‌ల్మాన్ ఖాన్ హీరోగా ముర‌గ‌దాస్ కిక్-2 చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నార‌ని వెలుగులోకి వ‌చ్చింది. సాజిద్ న‌డియా వాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. 'కిక్' చిత్రాన్ని నేరుగా సాజిద్ నే తెర‌కెక్కించినా..ఇప్పుడు మేకింగ్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుని ముర‌గ‌దాస్ కి కిక్-2 సినిమా అప్ప‌గించి న‌ట్లు వైర‌ల్ అవుతుంది.

అయితే తాజాగా ఈ ప్ర‌చారాన్ని సాజిద్ న‌డియావాల చిత్ర నిర్మాణ సంస్థ కొట్టి పారేసింది. కిక్-2 చిత్రానికి ముర‌గ‌దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌లేద‌ని వెల్ల‌డించారు. అయితే ఆ సినిమాకి బధులుగా ముర‌గ‌దాస్ తో మ‌రో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు. ముర‌గ‌దాస్ తో ఓ ప్రత్యేక ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలిపారు. దీంతో ఈ సినిమాకి సంబంధించిన విష‌యం లీక్ అవ్వ‌డంతో అది మార్కెట్ లోకిక్-2గా బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

'కిక్' లాంటి కామెడీ చిత్రాలు తెర‌కెక్కించ‌డం అన్న‌ది ముర‌గ‌దాస్ కి చేత‌కాద‌నే చెప్పాలి. ఆయ‌న స్టైల్ వేరు..ఆయ‌న మేకింగ్ వేరు. ఇప్ప‌టివ‌కూ ఆయ‌న యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ చిత్రాల్నే రూపొందించారు. వాటిలో తాను స్పెష‌లిస్ట్ అని ప్రూవ్ చేసుకున్నారు. ఇప్ప‌టికే ముర‌గ‌దాస్ బాలీవుడ్ లో 'గ‌జ‌నీ' రీమేక్ తో హిందీ మార్కెట్ లోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. అలాగే నిర్మాత‌గానూ సినిమాలు నిర్మిస్తున్నారు.

We would like to officially announce that all speculations and rumours with regard to #Kick2 are untrue.

A special project with #ARMurugadoss is underway. Would kindly request all media houses to wait for the official announcement soon.

Thank you! https://t.co/ZYt3blrptd

— Nadiadwala Grandson (@NGEMovies) March 10, 2024
Tags:    
  • Kollywood 
  • Stardirector 
  • Murugadoss 
  • Director 
  • Bollywood 
  • Movie 
  • Kick2 
  • Ghajini 
  • Sajidnadiadwala 
  • Filmindustry 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS