• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కానిస్టేబుల్​గా విజయ్...

కానిస్టేబుల్​గా విజయ్ దేవరకొండ.. ఏ సినిమా అంటే

| ఈ చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ మురళీధర్ గౌడ్ కూడా నటిస్తున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

By - Tupaki Desk
Update: 2023-09-11 12:39 GMT

మళ్లీరావా, జెర్సీ వంటి ఎమోషనల్​ డ్రామాలతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి.. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గ్యాంగ్​ స్టర్​ నేపథ్యంలో రాబోతుందని కూడా ఆ మధ్య వార్తలు వచ్చాయి. తాజాగా మరో ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది.

ఈ చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ మురళీధర్ గౌడ్ కూడా నటిస్తున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన తన కొత్త సినిమాల విషయల గురించి మాట్లాడుతూ.. తాను విజయ్ దేవరకొండ-గౌతమ్​ తిన్ననూరి సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు. తాను ఎస్సై పాత్ర పోషిస్తున్నట్లు తెలిపిన ఆయన.. విజయ్ తన కింద కానిస్టేబుల్‌గా నటిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి.

వాస్తవానికి గతంలోనే సినిమా ప్రకటించినప్పుడే విజయ్ దేవరకొండ లుక్​లో ఖాకీ చొక్కా ఉన్న కాన్సెప్ట్ పోస్టర్​ను రిలీజ్​ చేసింది మూవీటీమ్​. కానీ విజయ్ ఫేస్​ను రివీల్​ చేయలేదు. అయితే ఆ తర్వాత.. ఈ మధ్యే గ్యాంగస్టర్​ కథ అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు విజయ్​ దేవరకొండ.. కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నారని తెలిసింది.

దీంతో కానిస్టేబుల్​కు గ్యాంగ్ స్టర్ వరల్డ్​తో లింక్ ఎలా ఉండబోతుందా? లేదంటే పోలీస్ అధికారిగా ఉన్న విజయ్ గ్యాంగ్ స్టర్​గా మారతారా? అసలీ కథ ఏంటో? గౌతమ్ ప్లాన్ ఎలా ఉండబోతుందా అని రౌడీ ఫ్యాన్స్ ఆసక్తిగా తెగ ఆలోచించేస్తున్నారు. ఏదేమైనా విజయ్ పాత్ర మాత్రం మంచి రోలర్ కోస్టర్ రైడ్​గా ఉంటుందని చెబుతున్నారు.

ఇకపోతే ఈ చిత్రానికి అనిరూధ్ మ్యూజిక్ అందిస్తున్నారట. అసలే ఇప్పుడాయన మంచి ఫామ్​లో ఉన్నారు. ఆయన మ్యూజిక్​ ప్రతిఒక్కరినీ గూస్​ బంప్స్​ తెప్పిస్తున్నాయి. ఈయన మ్యూజిక్​ విజయ్​కు తోడైతే మాములుగా ఉండదని చెబుతున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇందులో హీరోయిన్గా శ్రీలీల నటిస్తుందని అంటున్నారు.

కాగా, విజయ్ దేవరకొండ లైగర్​తో భారీ ఫ్లాప్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత రీసెంట్​గా స్టార్ హీరోయిన్ సమంతతో కలిసి ఖుషిగా వచ్చారు. రీసెంట్​గా వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫాపుల్లో ఉన్న అటు విజయ్​ దేవరకొండకు ఇటు సమంతకు మంచి జోష్​ నిచ్చింది. ప్రస్తుతం ఈ ఇద్దరు ఆ సక్సెస్​ను ఎంజాయ్ చేస్తున్నారు.

Tags:    
  • Vijaydevarkonda 
  • Muralidhargoud 
  • Gauthathinnuri 
  • Vdupcomingmovie 
  • Policeofficer 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS