మూత ప‌డ‌నున్న ప్ర‌ముఖ మ్యూజిక్ ఛానెల్

ఎంటీవీ80, ఎంటీవీ మ్యూజిక్, క్ల‌బ్ ఎంటీవీ, ఎంటీవీ90, ఎంటీవీ లైవ్ ఛానెల్స్ ను మూసి వేయ‌నున్నామ‌ని, డిసెంబ‌ర్ 31 నుంచి ఆ ఛానెల్స్ వ‌ర‌ల్డ్ వైడ్ గా అందుబాటులో ఉండ‌వ‌ని తెలిపింది.;

Update: 2025-10-14 21:30 GMT

ఇప్పుడంటే ఎంట‌ర్‌టైన్‌మెంట్ కు బోలెడు ఆప్ష‌న్స్ వ‌చ్చాయి కానీ ఒక‌ప్పుడు మాత్రం ఎంట‌ర్టైన్మెంట్ అంటే దానికి అంద‌రూ ఎంటీవీనే సెలెక్ట్ చేసుకునేవారు. సోష‌ల్ మీడియా రాక‌ముందు ఎవ‌రైనా స‌రే ఆ మ్యూజిక్ ఛానెల్స్ చూస్తూనే పాట‌లు వింటూ ఎంట‌ర్టైన్ అయ్యేవారు. అలాంటి ఎంటీవీ ఛానెల్ ఇప్పుడు ఆడియ‌న్స్ కు ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది.

1981లో మొద‌లైన ఎంటీవీ

మ్యూజిక్ టెలివిజ‌న్(ఎంటీవీ) మొద‌టిగా 1981లో అమెరికాలో మొద‌లైంది. ఈ ఛానెల్ కేవ‌లం మ్యూజిక్ మాత్ర‌మే కాకుండా ఫ్యాష‌న్, రియాలిటీ షో ల‌తో బాగా పాపుల‌రైంది. సంగీత ప్ర‌పంచంలో యూత్ తో పాటూ అన్ని వ‌య‌సుల వారిని దాదాపు నాలుగు ద‌శాబ్ధాల పాటూ అల‌రించిన‌ ఎంటీవీ కంపెనీ త‌మ మ్యూజిక్ ఛానెళ్ల‌ను క్లోజ్ చేస్తున్న‌ట్టు వెల్ల‌డించింది.

డిసెంబ‌ర్ 31 నుంచి ప‌ర్మినెంట్ గా క్లోజ్

ఎంటీవీ80, ఎంటీవీ మ్యూజిక్, క్ల‌బ్ ఎంటీవీ, ఎంటీవీ90, ఎంటీవీ లైవ్ ఛానెల్స్ ను మూసి వేయ‌నున్నామ‌ని, డిసెంబ‌ర్ 31 నుంచి ఆ ఛానెల్స్ వ‌ర‌ల్డ్ వైడ్ గా అందుబాటులో ఉండ‌వ‌ని తెలిపింది. అయితే రియాలిటీ షో లు మాత్రం ఆడియ‌న్స్ కు ఎప్ప‌టికీ వినోదాన్ని అందిస్తూనే ఉంటాయ‌ని పారామౌంట్ గ్లోబ‌ల్ వెల్ల‌డించింది. కొన్ని నెల‌ల కింద‌ట ఎంటీవీ, స్కైడ్యాన్స్ మీడియాలో విలీన‌మ‌వ‌గా, ఖ‌ర్చు త‌గ్గించే ప్ర‌య‌త్నంలో భాగంగానే ఈ డెసిష‌న్ తీసుకుంద‌ని, వ్యూస్ త‌క్కువున్న ఛానెల్స్ ను మూసివేస్తున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుత రోజుల్లో ఎంట‌ర్టైన్‌మెంట్ కోసం ఎన్నో మార్గాలు రావ‌డం వ‌ల్లే ఎంటీవీ ఈ డెసిష‌న్ ను తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఎంటీవీ మ్యూజిక్ సేవ‌లు యూకె, ఐర్లాండ్ లో మూత‌ప‌డ‌టం స్టార్ట్ అయి, త‌ర్వాత యూర‌ప్, బ్రెజిల్, ఆస్ట్రేలియా లాంటి దేశాల‌కు కూడా వ్యాపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్, పోలాండ్, ఆస్ట్రియా దేశాల్లో కూడా మ్యూజిక్ ఛానెల్స్ క్లోజ్ అవ‌నున్నాయ‌ని స‌మాచారం. అయితే ఎంటీవీ త‌మ ఛానెల్స్ ను మూసివేస్తుండ‌టంపై ప‌లువురు రెస్పాండ్ అవుతూ, త‌మ చిన్న‌నాటి రోజుల‌ను గుర్తు చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు.

Tags:    

Similar News