రష్మికకే కాదు… గౌతమ్ తిన్ననూరికి కీలక ప్రాజెక్ట్.. ట్రోలర్స్ నోళ్లు మూతపడతాయా?

రష్మిక మందన్నకు పుష్ప 2, యానిమల్, 'ఛావా' లాంటి సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర వందల కోట్ల మార్కెట్ అయితే ఉంది.

Update: 2026-06-08 12:56 GMT

సంగీత సామ్రాజ్ఞి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ వార్త ఇప్పుడు ఇండస్ట్రీని ఊపేస్తోంది. ఈ సినిమాలో రష్మిక మందన్న లీడ్ రోల్ ప్లే చేయబోతుండటంతో అందరిలోనూ ఆసక్తితో పాటు బోలెడన్ని అనుమానాలు కూడా మొదలయ్యాయి. అయితే, ఈ ప్రతిష్టాత్మక సినిమా కేవలం రష్మిక నటనకు మాత్రమే కాదు.. 'కింగ్డమ్' మూవీ తర్వాత డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కెరీర్‌కు కూడా ఒక రకమైన అగ్నిపరీక్షే అని చెప్పాలి. ఇద్దరికీ ఎంతో కీలకమైన ఈ మూవీ విశేషాలు చూద్దాం..

రష్మికకు 'గ్రేట్ పర్ఫార్మర్' అనే ముద్ర పడేనా?:

రష్మిక మందన్నకు పుష్ప 2, యానిమల్, 'ఛావా' లాంటి సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర వందల కోట్ల మార్కెట్ అయితే ఉంది. కానీ ఇప్పటికీ ఆమెను ఒక స్టార్ గ్లామర్ హీరోయిన్‌గానే చూస్తున్నారు తప్ప ఒక గ్రేట్ యాక్ట్రెస్‌గా గుర్తించడం లేదు. అందుకే ఈ బయోపిక్ ఆమె నటనపై ఉన్న విమర్శలను పటాపంచలు చేయడానికి దొరికిన ఒక లైఫ్-చేంజింగ్ గోల్డెన్ ఛాన్స్.

డైరెక్టర్‌కు గట్టి 'కమ్‌బ్యాక్' అవసరం:

'జెర్సీ' సినిమాతో అందరి మనసులు గెలుచుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి.. ఆ తర్వాత వచ్చిన 'కింగ్డమ్' సినిమా డిజాస్టర్ అవ్వడంతో గట్టి ఎదురుదెబ్బ తిన్నారు.అందుకే ఈ బయోపిక్ ఆయనకు దర్శకుడిగా మళ్లీ ఫామ్‌లోకి రావడానికి చాలా కీలకమైన ప్రాజెక్ట్‌గా మారింది. ఇక అందుకే రష్మికతో సైలెంట్‌గా ఆమె ఇంట్లోనే లుక్ టెస్ట్ నిర్వహించేంతలా, ఈ సినిమా కోసం గౌతమ్ చాలా పర్సనల్ కేర్ తీసుకుంటూ స్క్రిప్ట్‌ను డిజైన్ చేస్తున్నారు.

'మహానటి' కీర్తి సురేష్ సీన్ రిపీట్ అవుతుందా?:

మహానటి సినిమా రాకముందు కీర్తి సురేష్ కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే చేసేది. సావిత్రి గారి పాత్రకు ఆమెను ఎంచుకున్నప్పుడు చాలా మంది విమర్శించారు. కానీ కీర్తి సురేష్ ఆ పాత్రతో నేషనల్ అవార్డు కొట్టి అందరి నోళ్లు మూయించింది. ఇక ఇప్పుడు రష్మిక విషయంలోనూ ప్రేక్షకులు అదే తరహా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెగెటివిటీనే ఛాలెంజ్‌గా తీసుకుని సుబ్బులక్ష్మి గారి హుందాతనాన్ని రష్మిక పండిస్తే.. ఆమె కెరీర్ కూడా ఊహించని మలుపు తిరుగుతుంది.

ఏది ఏమైనా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గారి లాంటి మహోన్నతమైన పాత్రను వెండితెరపై ఆవిష్కరించడం అంత సామాన్యమైన విషయం కాదు. ఇటు రష్మిక స్టార్ ఇమేజ్‌ను మార్చడానికి, అటు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ క్యాపబిలిటీని మళ్లీ నిరూపించడానికి ఈ సినిమా ఇద్దరికీ ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ కానుంది. మరి వీరిద్దరి కాంబినేషన్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే..

Tags:    

Similar News