MS రాజు 'అగధ'.. టీజర్ తో ఫుల్ హైపెక్కించారుగా..

ఇప్పుడు అదే జానర్‌ లో ప్రేక్షకులను భయపెట్టేందుకు, ఉత్కంఠకు గురిచేసేందుకు దర్శక నిర్మాత ఎంఎస్ రాజు మిస్టికల్ థ్రిల్లర్‌ అగధ మూవీతో ముందుకొస్తున్నారు.;

Update: 2026-05-07 06:30 GMT

టాలీవుడ్‌ లో సూపర్‌ నేచురల్ థ్రిల్లర్లకు ఎప్పుడూ స్పెషల్ రెస్పాన్స్ ఉంటుంది. ఇప్పుడు అదే జానర్‌ లో ప్రేక్షకులను భయపెట్టేందుకు, ఉత్కంఠకు గురిచేసేందుకు దర్శక నిర్మాత ఎంఎస్ రాజు మిస్టికల్ థ్రిల్లర్‌ అగధ మూవీతో ముందుకొస్తున్నారు. వర్షం, ఒక్కడు, మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి క్లాసిక్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఎంఎస్ రాజు.. ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్‌ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.



 


శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్న ఆ చిత్రంలో మా ఊరి పొలిమేర ఫేమ్ కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు శ్రవణ్ రెడ్డి, యంగ్ హీరోయిన్ ఉల్కా గుప్తా, వనితా విజయ్‌ కుమార్ కుమార్తె జోవికా విజయ్‌ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా అగధ సినిమాతో జోవికా విజయ్‌ కుమార్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే ప్రమోషన్లలో భాగంగా తాజాగా విడుదల చేసిన టీజర్ సినిమాపై ఒక్కసారిగా ఆసక్తి పెంచేసింది. టీజర్ ప్రారంభం నుంచే ఓ మిస్టీరియస్, డార్క్ ఫీల్‌ ను తీసుకొచ్చిన మేకర్స్.. విజువల్స్, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ తో భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అగధ అనే ఓ శక్తి చుట్టూ కథ తిరుగుతుందని టీజర్ ద్వారా అర్థమవుతోంది.

జీవితం, మరణం మధ్య నియంత్రణ కలిగిన ఆ శక్తి ఎదుట మనుషులు ఎంత వీక్ గా మారుతారనే కాన్సెప్ట్ ఆసక్తికరంగా కనిపిస్తోంది. టీజర్‌ లో చూపించిన విజువల్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెంచుతున్నాయి. ముఖ్యంగా దైవిక శక్తులు, భయం, సస్పెన్స్ అంశాలను కలిపి రూపొందించిన తీరు ఆకట్టుకుంటోంది. బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రతి సన్నివేశానికి మరింత హైప్ తీసుకొచ్చింది.

సంగీత దర్శకుడు రాకేష్ వెంకటాపురం అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్‌ కు మెయిన్ అసెట్ గా మారింది. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, జోవికా, ఉల్కా గుప్తా పాత్రలు కూడా టీజర్‌ లో నేచురల్ గా కనిపించాయి. ముఖ్యంగా జోవికా స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. టీజర్ చివర్లో వచ్చే అగధ ఎవరు? అనే ప్రశ్న సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది. కథ మొత్తం ఆ మిస్టరీ చుట్టూనే తిరిగే అవకాశం కనిపిస్తోంది.

ఇక చిత్రానికి ఎం.ఎస్ రాజు కథ, దర్శకత్వం అందిస్తుండగా.. నాని చామిడిశెట్టి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ గా ఎన్వీఎన్ సుబ్బారాజు వ్యవహరిస్తున్నారు. దాదాపు 85 రోజుల పాటు షూటింగ్ జరిపిన మేకర్స్.. భారీ సెట్లు, సుమారు 45 నిమిషాల విజువల్ ఎఫెక్ట్స్‌ తో సినిమాను గ్రాండ్‌ గా తెరకెక్కించినట్లు చెబుతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి అగధ మూవీ టీజర్ చూస్తుంటే.. ఎం.ఎస్ రాజు మరోసారి తన మార్క్ చూపించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. మరి ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.


Full View


Tags:    

Similar News