• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'సీతారామం' బ్యూటీ డబుల్...

'సీతారామం' బ్యూటీ డబుల్ ధమాకా

| హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సీతారామం సినిమాలో దుల్కర్‌ సల్మాన్ కి జోడీగా ఈ అమ్మడు హీరోయిన్ గా నటించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది

By - Tupaki Desk
Update: 2023-08-05 09:32 GMT

హిందీ సీరియల్స్ మరియు సినిమాలతో ఉత్తరాది ప్రేక్షకులను సుదీర్ఘ కాలంగా ఎంటర్టైన్ చేస్తున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ టాలీవుడ్‌ లో 'సీతారామం' సినిమా తో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సీతారామం సినిమాలో దుల్కర్‌ సల్మాన్ కి జోడీగా ఈ అమ్మడు హీరోయిన్ గా నటించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

సీతారామం తర్వాత తెలుగు లో వరుసగా ఈ అమ్మడికి ఆఫర్లు వచ్చాయి. కానీ ఈమె మాత్రం ఇప్పటి వరకు విజయ్‌ దేవరకొండ సినిమాతో పాటు నాని సినిమాలను మాత్రమే చేస్తోంది. ఆ రెండు సినిమాల తర్వాత ఈ అమ్మడికి టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు వస్తాయని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్‌ విషయం పక్కన పెడితే తాజాగా ఈ అమ్మడు కోలీవుడ్ నుండి బిగ్ ఛాన్స్ ని దక్కించుకుంది. ట్యాలెంటెడ్‌ హీరో శివ కార్తికేయన్‌ తాజా చిత్రంలో ఈమెను హీరోయిన్‌ గా ఎంపిక చేశారని తెలుస్తోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న శివ కార్తికేయన్ సినిమా ప్రారంభానికి ముందే మంచి బజ్‌ ను కలిగి ఉంది.

ఈ సినిమా కోసం చాలా మంది హీరోయిన్స్ ను యూనిట్‌ సభ్యులు పరిశీలించారు. చివరకు మృణాల్ ఠాకూర్‌ ను ఎంపిక చేశారని తెలుస్తోంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అవ్వడం వల్ల ఈ అమ్మడిని ఎంపిక చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కోలీవుడ్‌ లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ అమ్మడు తాజాగా అరుదైన అవార్డు ను సొంతం చేసుకుంది. ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్‌ లో డైవర్సిటీ ఆఫ్ సినిమా అనే అవార్డుకు మృణాల్ ఠాకూర్ ఎంపిక అయింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు ను వచ్చే వారంలో మృణాల్ అందుకోబోతుంది. ఇండియన్ ఫిల్మ్‌ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్‌ లో డైవర్సిటీ ఇన్ సినిమా అవార్డును సొంతం చేసుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉందని.. అదే సమయంలో గౌరవం గా ఉందని మృణాల్ ఆనందం వ్యక్తం చేసింది.

కోలీవుడ్‌ లో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌ లో నటించే అవకాశం రావడంతో పాటు ఇలా ప్రతిష్టాత్మక అవార్డు కి ఎంపిక అవ్వడం పట్ల ఆమె అభిమానులు డబుల్‌ ధమాకా అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో అభిమానులు తెగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Tags:    
  • Mrunalthakur 
  • Sitaramamactress 
  • Mrunal 
  • Kollywoodindustry 
  • Nani 
  • Hinannafilm 
  • Vijaydeverakonda 
  • Parasuram 
  • Armurugadoss 

Similar News

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS