• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మృణాల్‌ ఠాకూర్‌ రియల్...

మృణాల్‌ ఠాకూర్‌ రియల్ సిస్టర్‌ ఎవరో తెలుసా..!

| అయితే ఈసారి మాత్రం మేకప్‌ ఆర్టిస్టు లోచన్‌ ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.

By - Tupaki Desk
Update: 2024-10-05 18:45 GMT

బాలీవుడ్‌ లో సుదీర్ఘ కాలంగా సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మ మృణాల్‌ ఠాకూర్ సీతారామం సినిమాతో టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ సమయంలో స్టార్‌ హీరోయిన్‌ గా పేరు దక్కించుకుంది. టాలీవుడ్‌ లో స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు త్వరలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. మృణాల్‌ ఠాకూర్ నటించిన సీతారామం, హాయ్ నాన్న సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. టాలీవుడ్‌ లో ఈ అమ్మడు మోస్ట్‌ బిజీ హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే.


సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా తన అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. అయితే ఈసారి మాత్రం మేకప్‌ ఆర్టిస్టు లోచన్‌ ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. లోచన్ మరెవ్వరో కాదు.. మృణాల్‌ ఠాకూర్ సిస్టర్ అయిన లోచన్ ఠాకూర్ చాలా కాలంగా మేకప్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉంది. సీతారామం మొదలుకుని ఇటీవల వచ్చిన మృణాల్ సినిమా వరకు అన్నింటిలోనూ లోచన్‌ ఠాకూర్‌ మేకప్ ఆర్టిస్టుగా వ్యవహరించింది. అంతే కాకుండా హెయిర్ స్టైలిష్ చేస్తూ మృణాల్‌ ను మరింత అందంగా లోచన్‌ చూపిస్తూ ఉంటుంది.


లోచన్‌ ప్రస్తుతం మృణాల్‌ ఠాకూర్ హీరోయిన్‌ గా చేస్తున్న ప్రతి సినిమాకు మేకప్‌ ఆర్టిస్టుగా, హెయిర్ డ్రెస్సర్ గా వ్యవహరిస్తూ ఉంది. మృణాల్‌ ఠాకూర్‌ ప్రతి సినిమాలోనూ అంత అందంగా కనిపించడంలో ఆమె పాత్ర కీలకం అని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. లోచన్‌ ఠాకూర్ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఆమె బాలీవుడ్‌ లో వరుసగా సినిమాలకు మేకప్ ఆర్టిస్టుగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా స్టార్‌ హీరోయిన్స్ కి ఈమె మేకప్‌ ఆర్టిస్టుగా, హెయిర్‌ డ్రెస్సర్ గా చేస్తున్న నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. తనను అందంగా చూపిస్తున్నందుకు సిస్టర్ కి కృతజ్ఞతలు అంటూ మృణాల్‌ ఠాకూర్ సోషల్‌ మీడియా ద్వారా లోచన్‌ ఠాకూర్ కి కృతజ్ఞతలు తెలిపింది.

ప్రస్తుతం హిందీలో మూడు సినిమాలతో పాటు, తెలుగులోనూ ఒక సినిమాలో మృణాల్‌ ఠాకూర్ నటిస్తున్న విషయం తెల్సిందే. తమిళంలోనూ మృణాల్‌ ఠాకూర్ ఒక సినిమాను చేస్తుంది. ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బాలీవుడ్‌, టాలీవుడ్‌ లో వరుస సినిమాలు చేస్తున్న మృణాల్ ఠాకూర్‌ ముందు ముందు మరింతగా బిజీ బిజీ సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా రెగ్యులర్‌ గా వార్తల్లో నిలుస్తూ ఆఫర్లు దక్కించుకుంటున్న మృణాల్‌ ఠాకూర్ ని లోచన్ మరింత అందంగా చూపించాలని కోరుకుందాం.

Tags:    
  • Mrunalthakur 
  • Actress 
  • Sitaramam 
  • Lochanthakur 
  • Sisters 
  • Bollywood 
  • Filmindustry 

Similar News

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

Copyright @2026

Powered by Blink CMS