బ్లాక్ డ్రెస్సులో మృణాల్ మెరుపులు.. 'సారీ.. నేను బేసిక్ కాదు' అంటూ సెటైర్!
టాలీవుడ్ 'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో మరోసారి సెగలు పుట్టిస్తోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటో షూట్ నిమిషాల్లోనే ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
టాలీవుడ్ 'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో మరోసారి సెగలు పుట్టిస్తోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటో షూట్ నిమిషాల్లోనే ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. "MT 2.0 ఎడిషన్.. సారీ, నేను ఇకపై బేసిక్ పనులు చేయను" అంటూ ఆమె ఇచ్చిన క్యాప్షన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కేవలం గ్లామర్ మాత్రమే కాదు, తన యాటిట్యూడ్‌తో కూడా అభిమానులను ఫిదా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఆ అదిరిపోయే ఫోటో షూట్ విశేషాలు ఇవే..
బ్లాక్ సాటిన్ డ్రెస్సులో అదిరిపోయే లుక్:
మృణాల్ ఈ ఫోటో షూట్ కోసం ఒక బ్లాక్ సాటిన్ స్ట్రాప్‌లెస్ మ్యాక్సీ డ్రెస్‌ను ఎంచుకుంది. సిల్కీ ఫినిషింగ్‌తో, ఒంటికి హత్తుకుపోయే ఈ మోడ్రన్ డ్రెస్ ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేసింది. దీనికి తోడు ఆమె పెట్టుకున్న పెద్ద పెద్ద ఎమరాల్డ్ పచ్చలు ఇయర్ రింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నలుపు రంగు డ్రెస్సులో ఆ పచ్చ రంగు మెరుపులు చూసి ఫ్యాన్స్ 'అద్భుతం','మోడ్రన్ అందం','ఇంటర్నేషనల్ బ్యూటీ' అంటూ కామెంట్స్ కురిపిస్తున్నారు.
సీరియల్స్ నుంచి సినిమా స్టార్ వరకు:
మృణాల్ ప్రయాణం చాలా స్ఫూర్తిదాయకం. 2012లో 'ముజ్సే కుచ్ కెహెతి... ఏ ఖామోషియాన్' అనే హిందీ సీరియల్‌తో కెరీర్ మొదలుపెట్టి, 2014లో మరాఠీ సినిమా 'విట్టి దండు'తో వెండితెరకు పరిచయమైంది. ఇక ఆ తర్వాత బాలీవుడ్‌లో సత్తా చాటి, సౌత్ ఇండియాలో 'సీతారామం'తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు తెలుగు, హిందీ, మరాఠీ భాషల్లో వరుస ఆఫర్లతో బిజీగా గడుపుతోంది.
'డెకాయిట్' సక్సెస్.. క్రేజీ ఆఫర్లు:
ఈ ఏడాది అడివి శేష్‌తో కలిసి నటించిన 'డెకాయిట్' సినిమాతో మృణాల్ మరో సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీ సక్సెస్‌తో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం ఒక భారీ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించే ఛాన్స్ కూడా కొట్టేసిందని ఫిలిం నగర్ టాక్. ఇక కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.
వరుణ్ ధావన్‌తో రొమాన్స్:
మృణాల్ త్వరలోనే బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ సరసన సందడి చేయనుంది. వీరిద్దరూ కలిసి నటించిన 'హే జవానీ తో ఇష్క్ హోనా హై' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా జూన్ 5, 2026న విడుదల కానుంది.ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనుల్లో ఆమె బిజీగా ఉంది. అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూ మృణాల్ దూసుకుపోతోంది.
మొత్తానికి మృణాల్ ఠాకూర్ తన ఫ్యాషన్ సెన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 'MT 2.0' వెర్షన్‌లో ఆమె చూపిస్తున్న కాన్ఫిడెన్స్ నిజంగా అద్భుతం. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, ఇలాంటి ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వడం ఆమెకు అలవాటే.మరిన్ని మూవీస్ తో ఆమె అలరించాలని కోరుకుందాం .