రోషన్ 'మోగ్లీ'.. సెన్సార్ అలా ఇచ్చిందేంటి?

ఈ మేరకు ఇప్పటికే సోషల్ మీడియాలో కొత్త పోస్టర్ తో ప్రకటించిన మేకర్స్.. తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.;

Update: 2025-12-10 06:50 GMT

ప్రముఖ యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల లీడ్ రోల్ లో రెండో సినిమాగా మోగ్లీ రూపొందిన విషయం తెలిసిందే. కలర్ ఫోటో మూవీతో నేషనల్ అవార్డు అందుకుని అందరి దృష్టిని ఆకర్షించిన సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.



 


విభిన్న అంశంతో రూపొందిన మోగ్లీ మూవీ డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం మేకర్స్ అనౌన్స్ చేశారు. అంతకుముందే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. టీజర్, ట్రైలర్ సహా పలు ప్రమోషనల్ కంటెంట్ ను విడుదల చేసి ఆడియన్స్ లో మోగ్లీ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశారని చెప్పాలి.

అయితే డిసెంబర్ 12న బాలయ్య అఖండ 2: తాండవం మూవీ.. ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో మోగ్లీ వాయిదా పడింది. డిసెంబర్ 13వ తేదీన థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ మేరకు ఇప్పటికే సోషల్ మీడియాలో కొత్త పోస్టర్ తో ప్రకటించిన మేకర్స్.. తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు మేకర్స్ అనౌన్స్ చేయకపోయినా.. సోషల్ మీడియాలో సెన్సార్ సర్టిఫికెట్ వైరల్ గా మారింది. 160 నిమిషాల రన్ టైమ్ తో మోగ్లీ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు అందులో పొందుపరిచి ఉంది. అంతే కాదు.. మోగ్లీ మూవీ ఫైనల్ కాపీని చూసిన సెన్సార్ బోర్డు అధికారులు.. సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇవ్వడం గమనార్హం.

ఎందుకంటే ఇప్పటి వరకు మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ లో ఎలాంటి సెన్సిటివ్ కంటెంట్ ఎక్కడా కనిపించలేదు. టీజర్, ట్రైలర్ లో కూడా అలా ఏం లేదు. కానీ సెన్సార్ అధికారులు మాత్రం ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. నిజానికి మూవీలో హింస, లైంగిక సన్నివేశాలు, అసభ్యకరమైన భాష వంటి అంశాలు ఉంటే ఏ సర్టిఫికెట్ ఇస్తుంటారు. సినిమాలు టీవీలో ప్రసారం కావడానికి ముందు కొన్ని సీన్స్ ట్రిమ్ చేయాలని చెబుతారు.

సినిమాను 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే చూడాలని చెబుతారు. అయితే ఇప్పుడు మోగ్లీకి ఏ సర్టిఫికెట్ రావడం చర్చనీయాంశంగా మారింది. టీజర్, ట్రైలర్ లో సెన్సిటివ్ పాయింట్స్ లేకపోవడంతో అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. కానీ అధికారులు జారీ చేయడంలో సినిమాలో సెన్సిటివ్ పాయింట్స్ ఉండవచ్చేమో. మరి సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు కదా.. వేచి చూడాలి.

Tags:    

Similar News