ఫోటో స్టోరి: తీర్చిదిద్దిన శిల్పంలా మౌని
మౌని రాయ్ పరిచయం అవసరం లేదు. `నాగిన్` బ్యూటీ `గోల్డ్` అనే చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టి, అటుపై `కేజీఎఫ్`లో స్పెషల్ నంబర్ తో సౌత్ లో అడుగుపెట్టింది.;
మౌని రాయ్ పరిచయం అవసరం లేదు. `నాగిన్` బ్యూటీ `గోల్డ్` అనే చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టి, అటుపై `కేజీఎఫ్`లో స్పెషల్ నంబర్ తో సౌత్ లో అడుగుపెట్టింది. మౌని ఇంతకుముందు రణబీర్ `బ్రహ్మాస్త్ర`లోను తన అతిథి పాత్రతో ఆకట్టుకుంది. ఇక దిశా పటానీతో స్నేహం కారణంగాను మౌని రాయ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన ఈ అమ్మడు కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉంది.
మరోవైపు సోషల్ మీడియాల్లోను మౌని అన్ స్టాపబుల్ గా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఇన్ స్టా వేదికగా భారీ ఫాలోయింగ్ ఉన్న తారల్లో ఒకరిగా మౌని పాపులరైంది. తాజాగా ఈ భామ నాచు రంగు ట్రెడిషనల్ దుస్తుల్లో గుబులు రేపుతున్న ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. స్లీవ్‌లెస్ బ్లౌజ్ .. బ్రాలెట్-స్టైల్ తో మౌని ఇంటర్నెట్ ని కిల్ చేసింది. అయితే తన టోన్డ్ దేహశిరుల్ని కవర్ చేసేందుకు చీర కానీ, దుపట్టా కానీ ఎంతమాత్రం సహకరించలేదు. ఈ కొత్త లుక్ లో మౌని అందచందాలకు యువతరం ఫిదా అయిపోతోంది. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.
మౌని ప్రస్తుత కెరీర్ మ్యాటర్ కి వస్తే.. తదుపరి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం `విశ్వంభర`లో ఒక ప్రత్యేక పాటలో కనిపించనుది. ఈ భారీ ఫాంటసీ డ్రామా మూవీని పాన్ ఇండియా మార్కెట్లో రిలీజ్ చేయాలనేది ప్లాన్. జాతీయ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.