పెద్ది మూవీ.. టైమ్ మిషన్ లో వెనక్కి వెళ్లినట్టుంది
90స్, లిటిల్ హార్ట్స్ ఫేమ్ మౌళి రీసెంట్ గా పెద్ది సినిమా గురించి మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.;
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు రామ్ చరణ్. అప్పటివరకు మెగా పవర్ స్టార్ గా గుర్తింపు పొందిన చరణ్, ఆ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ అయ్యారు. ఆర్ఆర్ఆర్ తో తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకున్న రామ్ చరణ్, ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చేసి డిజాస్టర్ ను మూట గట్టుకున్నారు.
భారీ అంచనాలతో వస్తోన్న పెద్ది
దీంతో చరణ్, అతని ఫ్యాన్స్ తమ ఆశలన్నింటినీ ప్రస్తుతం చేస్తున్న పెద్ది పైనే పెట్టుకున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా దీనిపై అందరికీ మొదటి నుంచే భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని ఒక్కొక్కరు చెప్తున్న మాటలు పెద్దిపై హైప్ ను ఇంకాస్త పెంచుతుంది.
90స్, లిటిల్ హార్ట్స్ ఫేమ్ మౌళి రీసెంట్ గా పెద్ది సినిమా గురించి మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మౌళి నటించిన లిటిల్ హార్ట్స్ మూవీ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఆ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న మౌళి, పెద్ది మూవీ గురించి మాట్లాడారు. తన కెమెరామెన్ తో కలిసి పెద్ది సినిమా సెట్స్ కు వెళ్లినట్టు మౌళి చెప్పారు.
ప్రతీదీ చాలా నేచురల్‌గా..
తన కెమెరా మ్యాన్ రత్నవేలుకి అసోసియేట్ అని, ఆయన ద్వారానే తాను పెద్ది సినిమా క్రికెట్ సెట్ కు వెళ్లానని, ఆ సెట్ కు వెళ్లాక టైమ్ మిషన్ లో వెనక్కి వెళ్లినట్టుందని, స్టేడియంలో ఆడియన్స్ నుంచి ప్రతీదీ చాలా నేచురల్ గా ఉందని, స్టేడియం వెనుక దూరంగా ఒక కొండ ఉంటుందని, అది కనిపించాలని కొండ వెనుక లైట్ ను పెట్టారని, పెద్దిని డైరెక్టర్ చాలా క్లారిటీతో తెరకెక్కిస్తున్నట్టు మౌళి చెప్పారు. ఈ సినిమా గురించి మౌళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా, మౌళి కామెంట్స్ విని మెగా ఫ్యాన్స్ చాలా ఖుషీ అవుతున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ పెద్దికి సంగీతం అందిస్తున్నారు.