మోనాలిసా ఎన్ని కోట్లు సంపాదించిందంటే?

వైరల్ సెన్సేషన్ మోనాలిసా ప్రేమ‌లో ప్ర‌పంచం నిండా మునిగిపోయింది. ఆమె అందాన్ని ఆరాధించ‌ని యువ‌కుడు లేడు.;

Update: 2025-06-16 08:30 GMT

నిన్న మొన్న‌టి వ‌ర‌కూ ఎవ‌రైనా ఊహించారా? బ‌జార్ లో జాత‌ర‌ల్లో పూస‌ల‌మ్ముకునే అమ్మాయి ఓవ‌ర్ నైట్ స్టార్ అవుతుంద‌ని? మ‌నం ప్ర‌తి విలేజ్ జాత‌ర‌లో చాలా మంది పూస‌ల‌మ్మే అమ్మాయిలను చూసి ఉంటాం. కానీ వారెవ‌రికీ ప‌ట్ట‌ని యోగం ప్ర‌యాగ్ రాజ్ కుంభ‌మేళా లో క‌నిపించిన పూస‌ల‌మ్మే అమ్మాయికి ద‌క్కింది. అదృష్టం అంటే ఇదేనేమో! మ‌హర్జాత‌కురాలు అంటే ఈమెనే.. సందేహం అక్క‌ర్లేదు.

వైరల్ సెన్సేషన్ మోనాలిసా ప్రేమ‌లో ప్ర‌పంచం నిండా మునిగిపోయింది. ఆమె అందాన్ని ఆరాధించ‌ని యువ‌కుడు లేడు. అంద‌మైన ఆ కళ్లు, చిరున‌వ్వు, తీరుగ్గా తీర్చిదిద్దిన మోము చూసి ప‌డిపోయారు. ఇప్పుడు అదే అందం అభిన‌యం మోనాలిసాకు ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. అయితే అంద‌రూ భావించిన‌ట్టు కోట్లు, బిలియన్లు కూడ‌బెట్ట‌డం లేదు కానీ, త‌న స్థాయిలో ల‌క్ష‌ల్లో సంపాదించుకుంటోంద‌ని స‌మాచారం.

మహాకుంభమేళాలో పూస‌ల‌ దండలు అమ్మిన మోనాలిసా వీడియోలు అక‌స్మాత్తుగా వైరల్ కావడంతో రాత్రికి రాత్రే సంచలనంగా మారింది. ఆమె తన వ్యక్తిత్వం, అందమైన చిరునవ్వు ఆకర్షణీయమైన కళ్ళతో అందరి దృష్టిని ఆకర్షించింది. మోస్ట్ అవైటెడ్ సాంగ్ .. మోనాలిసా న‌టించిన‌ది ఇటీవ‌లే యూట్యూబ్ లో విడుద‌లై రికార్డుల మోత మోగిస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు ఈ వీడియోని త‌ర‌చి త‌ర‌చి చూస్తున్నారు. పూస‌ల‌మ్మాయి కొత్త అవతారంలో ఎలా ఉందో చూడటానికి ఆసక్తిగా ఎదురు చూసిన వారికి ఇది ట్రీట్ గా మారింది. మోనాలిసా మ్యూజిక్ వీడియో సాద్గి 14 జూన్ 2025న విడుదలైంది. ఇందులో ఉత్కర్ష్ సింగ్‌తో కలిసి మోనాలిసా నటించింది.

మోనాలిసా తొలి ప్రదర్శన ల‌క్ష‌లాది హృదయాలను గెలుచుకుంది. మ్యూజిక్ వీడియోలో, మోనాలిసా ఎంబ్రాయిడరీ లెహంగా, స‌రిప‌డే ఆభ‌ర‌ణాలు ఉపకరణాలలో అద్భుతంగా కనిపించింది. మోనాలిసా అందంలో వేరే ఏ ఇత‌ర హీరోయిన్ కి త‌క్కువేమీ కాద‌ని నిరూపించింది. అవ‌కాశం రావాలే కానీ, అదృష్టం త‌లుపు త‌ట్టాలే కానీ, ఏదో ఒక రోజొస్తుంద‌ని మోనాలిసా నిరూపించింది.

మోనాలిసా రుద్రాక్ష మాల‌లు, పూస‌ల దండ‌లు అమ్మడం ద్వారా జీవనం సాగించేది. కానీ విధి వేరొక‌టి త‌లిచింది. ఇప్పుడు మోనాలిసా క‌ల‌ల రాణి. త‌దుప‌రి సరోజ్ మిశ్రా హిందీ చిత్రంలో న‌టిస్తోంది. అదంతా స‌రే.. మోనాలిసా ఎంత సంపాదిస్తుంది? అంటే... తన ఆదాయం ఏమిటో వెల్లడించింది.. బాబా మహాకల్ .. తల్లి గంగా ఆశీర్వాదాలతో కొంచెం సంపాదిస్తున్నానని, అభిమానుల మద్దతు, ప్రజల ఆశీర్వాదాలతో కోట్లు, బిలియన్లలో కూడా సంపాదిస్తానని మోనాలిసా వ్యాఖ్యానించింది. దర్శకుడు సనోజ్ మిశ్రా మోనాలిసాకు సినిమాలో న‌టించే అవ‌కాశం అందించారు. ప్ర‌స్తుతం ఈ భామ సినీ ఆరంగేట్రం కోసం ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తోంది. న‌టనలో పూర్తి స్థాయి శిక్ష‌ణ తీసుకుంటున్న మోనాలిసా, త‌న వృత్తిలో మెరుగులు దిద్దుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

సోషల్ మీడియాలో మోనాలిసా సాద్గి పాట‌ను షేర్ చేయ‌గానే, క్లిక్ లు లైక్ ల‌తో హోరెత్తింది. తాజా పోస్ట్‌కి వేల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి. ఒక అభిమాని అందమైన పాట, గొప్ప‌ ప్రదర్శన అంటూ మోనాలిసాను పొగిడేశాడు.

Tags:    

Similar News