ఫస్ట్ లుక్ తో ఊపేసిన వర్మ.. వశిష్ట అంతకుమించి?
మోక్షజ్ఞ పేరు వినగానే ఇప్పుడు ఒక్క సినిమా కాదు.. నందమూరి ఫ్యాన్స్ ఎన్నో ఏళ్ల వెయిటింగ్ గుర్తొస్తుంది.
మోక్షజ్ఞ పేరు వినగానే ఇప్పుడు ఒక్క సినిమా కాదు.. నందమూరి ఫ్యాన్స్ ఎన్నో ఏళ్ల వెయిటింగ్ గుర్తొస్తుంది. అలాంటి హీరోను స్క్రీన్ పైకి ఎలా తీసుకురావాలనేది దర్శకుడికి పెద్ద ఛాలెంజ్. దాన్ని ముందుగా అందుకున్నది టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ బయటకు వచ్చిన రోజు వచ్చిన రెస్పాన్స్ చూస్తే.. ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో అర్థమైంది. ఒక్క పోస్టర్ తోనే మోక్షజ్ఞపై ఉన్న ఇమేజ్ ను మార్చే ప్రయత్నం చేశారు వర్మ.
ఆ లుక్‌లో మోక్షజ్ఞను చూసిన ఫ్యాన్స్ కు కొత్త ఫీలింగ్ వచ్చింది. ఇంతకాలం చూసిన మోక్షజ్ఞ వేరు.. పోస్టర్ లో కనిపించిన మోక్షజ్ఞ వేరు అన్నట్టుగా మేకోవర్ ఉండటంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ముఖ్యంగా నందమూరి వారసుడి ఎంట్రీ ఇలా ఉండబోతోందా అనే ఇంట్రెస్ట్ పెరిగింది. సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే ఫస్ట్ లుక్ తో ఫుల్ హైప్ రావడం అప్పట్లో స్పెషల్ గా నిలిచింది.
కానీ కథ అక్కడితో ఆగిపోయింది. కొన్ని కారణాలతో ప్రశాంత్ వర్మ కాంబినేషన్ ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు మోక్షజ్ఞ డెబ్యూను దర్శకుడు వశిష్ఠ చేతుల్లో పెట్టారు. అయితే మోక్షజ్ఞ తొలి సినిమాతోనే తనకంటూ ఒక స్పెషల్ మార్క్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కనుక రొటీన్ మాస్ కథ కాకుండా భారీ ఫాంటసీ వరల్డ్ ను వశిష్ట ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
గతంలో హీరోను ఎలివేట్ చేయడానికి ఫైట్లు, డైలాగులు, మాస్ సీన్లు ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు మోక్షజ్ఞ విషయంలో కొత్త వరల్డ్ క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే వశిష్ఠకు అసలు ప్లస్ పాయింట్ కావచ్చు. బింబిసారతో ఫాంటసీ కథను డీల్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అదే జోన్‌ను మరింత బిగ్ రేంజ్ లో తీసుకెళ్లే అవకాశం ఆ సినిమాతో దక్కుతోంది. మోక్షజ్ఞకు కూడా ఇది ప్లస్ కావచ్చు.
ఎందుకంటే మొదటి సినిమాతోనే తనను ఒక నార్మల్ కమర్షియల్ హీరోగా కాకుండా స్పెషల్ వరల్డ్ కు చెందిన హీరోగా పరిచయం చేసే అవకాశం ఉంటుంది. ఇక సినిమాలో బాలకృష్ణ పాత్ర కూడా కీలకంగా ఉండబోతుందనే ప్రచారం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. తండ్రి స్టార్ డమ్ ను యూజ్ చేసుకోవడం మాత్రమే కాకుండా.. మోక్షజ్ఞ రోల్ కు స్ట్రాంగ్ సపోర్ట్ అందించేలా బాలయ్య ఉంటుందని టాక్.
అయితే ప్రశాంత్ వర్మ ఇప్పటికే మోక్షజ్ఞను ఎలా చూపించబోతున్నారో ఫస్ట్ లుక్ తో ఒక స్టాండర్డ్ సెట్ చేశారు. ఇప్పుడు వశిష్ఠ నుంచి వచ్చే లుక్ ఆ అంచనాలను దాటాలి. కేవలం మోక్షజ్ఞను స్టైలిష్ గా చూపిస్తే సరిపోదు. పోస్టర్ చూసిన వెంటనే ఆ హీరో కోసం ఇలాంటి కథే కావాలని అనిపించేలా ఉండాలి. అందుకే ఇప్పుడు మోక్షజ్ఞ సినిమా ఫస్ట్ లుక్ పై అంచనాలు మామూలుగా లేవు. వర్మ ఒక్క పోస్టర్ తో హైప్ పెంచితే.. వశిష్ఠ ఆ హైప్ ను ఏ రేంజ్ కు తీసుకెళ్తారనేది ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే.