మోహన్ లాల్ 'వృషభ'.. తెలుగులో గట్టి సపోర్ట్ తోనే..

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వరుస సినిమాలతో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2025-12-16 19:35 GMT

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వరుస సినిమాలతో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఎలాంటి గ్యాప్ ఇవ్వకుండా బాక్సాఫీస్ వద్ద సినిమాలు దించుతూనే ఉన్నారు. 2025లో ఇప్పటికే ఎంపురాన్, తుడురుమ్, హృదయ పూర్వం సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన లాలెట్టన్.. ఇప్పుడు వృషభ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

భారీ బడ్జెట్ తో ఫాంటసీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమా.. డిసెంబర్ 25వ తేదీన థియేటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా.. పలుమార్లు వాయిదా పడింది. ఇప్పుడు ఎట్టకేలకు విడుదల అవ్వనుండగా.. మలయాళంతోపాటు తెలుగులో కూడా సందడి చేయనుండడం విశేషం.

అదే సమయంలో వృషభ తెలుగు రైట్స్ ను ప్రముఖ సంస్థ గీతా ఆర్ట్స్ సొంతం చేసుకుంది. క్రిస్మస్ కానుకగా గ్రాండ్ గా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే గీతా ఆర్ట్స్ విడుదల చేస్తుండడంతో సినిమాకు గట్టి సపోర్ట్ లభించిందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. దీంతో ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నిజానికి.. మోహన్ లాల్ కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆయన నుంచి మరో మూవీ వస్తుండడంతో అంతా ఆసక్తి చూపిస్తారు. దానికితోడు గీతా ఆర్ట్స్ మద్దతు తోడవ్వడం సానుకూలమైన విషయమని చెప్పాలి. సాలిడ్ నెంబర్ థియేటర్స్ లో మూవీ రిలీజ్ అవ్వనుండడం పక్కానేమో.

ముఖ్యంగా కంటెంట్ ఉన్న సినిమాలకు గీతా ఆర్ట్స్ కచ్చితంగా సపోర్ట్ అందిస్తుంటుంది. ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన కాంతార, చావా వంటి డబ్బింగ్ వెర్షన్స్ ను రిలీజ్ చేసి మంచి విజయాలు సాధించింది. భారీ లాభాలు కూడా అందుకుంది. ఇప్పుడు ధురంధర్ రిలీజ్ చేస్తుందని వార్తలు వస్తుండగా.. వృషభ రైట్స్ ను సొంతం చేసుకుంది.

ముందు రిలీజ్ చేసిన డబ్బింగ్ వెర్షన్స్.. ఒరిజినల్ లాంగ్వేజ్ లో వచ్చిన కొన్ని రోజులకు తెలుగులో తీసుకొచ్చిన గీతా ఆర్ట్స్.. ఇప్పుడు వృషభను మాత్రం మాలీవుడ్ తో పాటు ఒకేసారి టాలీవుడ్ లో విడుదల చేస్తుంది. అయితే క్రిస్మస్ కు వృషభతోపాటు శంభాల, ఛాంపియన్, ఈషా వంటి పలు సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. మరి వృషభ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News