తుడ‌రుం డైరెక్ట‌ర్‌తో లాలిట‌న్ మ‌రో క్రైమ్ థ్రిల్ల‌ర్‌!

గ‌త ఏడాది కూడా ఇదే పంథాలో సినిమాలు చేసిన మోహ‌న్ లాల్ వాటిని పూర్తి చేసి మ‌రో మూడు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్నారు.;

Update: 2026-04-15 06:50 GMT

సీనియ‌ర్ హీరోలంతా ఇప్పుడు ఫుల్ స్పీడుతో సినిమాలు చేస్తున్నారు. అయితే మ‌ల‌యాళ సూపర్ స్టార్ మోహ‌న్ లాల్ వ్య‌వ‌హార శైలి ఇందుకు పూర్తి భిన్నం. స్వ‌త‌హాగా మ‌ల‌యాళంలో రాకెట్ స్పీడుతో సినిమాల‌ని పూర్తి చేసే మోహ‌న్ లాల్ మిగ‌తా భాష‌ల హీరోల‌కు మించి ఏడాదికి మూడు నాలుగు సినిమాల్లో న‌టిస్తుంటారు. గ‌త ఏడాది కూడా ఇదే పంథాలో సినిమాలు చేసిన మోహ‌న్ లాల్ వాటిని పూర్తి చేసి మ‌రో మూడు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్నారు.



 


ఇప్ప‌టికే మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టితో క‌లిసి కొన్నేళ్ల విరామం త‌రువాత భారీ మ‌ల్టీస్టార‌ర్‌మూవీ `పేట్రియాట్‌`ని పూర్తి చేశారు. మ‌హేష్ నారాయ‌ణ‌న్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మే 1న భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు ప్ర‌స్తుతం జ‌రుగుతున్నాయి. ఇక దీనికి ముందు ఇప్ప‌టికే `దృశ్యం 3`ని పూర్తి చేసిన మోహ‌ల్ లాల్ దీన్ని మే 21కి థియేట‌ర్ల‌లోకి తీసుకురాబోతున్నారు. దీనిపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.

ఇప్ప‌టికే రెండు భాగాలు సూప‌ర్ హిట్ కావ‌డం, స్టోరీలో స‌స్పెన్స్ అలాగే కొన‌సాగుతుండ‌టం.. థ‌ర్డ్ పార్ట్‌కు క్యారీ కావ‌డంతో పార్ట్ 3 కోసం ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. `జైల‌ర్ 2`లో అతిథి పాత్ర‌లోనూ అల‌రించ‌నున్న లాలిట‌న్ తాజాగా మ‌రో క్రేజీ థ్రిల్ల‌ర్‌ని స్టార్ట్ చేశారు. గ‌త ఏడాది త‌రుణ్ మూర్తి డైరెక్ష‌న్‌లో మోహ‌న్ లాల్ చేసిన మూవీ `తుడ‌రుం. క్రైమ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమా మ‌ల‌యాళ‌, త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో విడుద‌లై రూ. 200 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి అంద‌రిని ఆశ్చ‌ర్చానికి గురి చేసింది.

ఇప్పుడు ఇదే బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌లో మ‌రో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ రూపొందుతోంది. దీనికి `అతిమ‌నోహ‌రం` అనే టైటిల్‌ని ఫైన‌ల్ చేశారు. చాలా ఏళ్ల విరామం త‌రువాత మీరా జాస్మిన్ తో మోహ‌న్ లాల్ చేస్తున్న సినిమా ఇది. మోహ‌న్ లాల్ న‌టిస్తున్న 366వ సినిమా ఇది. ఇందులో మోహ‌న్ లాల్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. జ‌న‌వ‌రి 23న ఫ‌స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. తాజాగా పూర్త‌యింది. ఆషిక్ ఉస్మాన్ నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.

Tags:    

Similar News