ఒకే ఫ్రేమ్ లో బిగ్ స్టార్స్.. ఇది స్పెషల్ పార్టీ!

మలయాళ సినీ పరిశ్రమలో నటీనటులకు మధ్య స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.;

Update: 2025-07-22 10:08 GMT

మలయాళ సినీ పరిశ్రమలో నటీనటులకు మధ్య స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కడ ఉండే ఐక్యత గురించి మిగతా ఇండస్ట్రీలో కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇటీవల జరిగిన ఓ గెట్తు టుగెదర్ కూడా వైరల్ అవుతోంది. ప్రముఖ నటుడు మోహన్‌లాల్ నివాసంలో ఫహద్ ఫాజిల్, నజ్రియా నజిమ్, ఫర్హాన్ ఫాజిల్ కుటుంబసభ్యులు స్పెషల్ గా సందడి చేశారు.


ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. సీనియర్ నటుడు మోహన్‌లాల్, ఆయన కుటుంబంతో పాటు ఫహద్ ఫాజిల్ ఫ్యామిలీ, సరదాగా పోజులు ఇచ్చారు. ఇటీవల సత్యన్ అంథికాడ్ దర్శకత్వంలో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో రూపొందిన 'హృదయపూర్వం' టీజర్ విడుదలైంది. ఈ చిత్రంలో మోహన్‌లాల్, ఫహద్ ఫాజిల్ అభిమాని పాత్రలో కనిపిస్తాడు.


టీజర్‌లో ఫహద్‌ను బాగా హైలెట్ చేయడం విశేషం. ఆ టీజర్‌ సక్సెస్ ను సెలబ్రేట్ చేసేందుకు ఫహద్, నజ్రియా, ఫర్హాన్ మోహన్‌లాల్ ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది. "స్టార్స్ మధ్యన కూడా లాలేటన్ ఎప్పుడూ స్పెషల్" అంటూ అభిమానులు ప్రశంసలు కురిపించారు. ఫోటోలను మోహన్‌లాల్‌కు సన్నిహితుడు సమీర్ హంసా తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్ చేసుకున్నారు. ఇందులో మోహన్‌లాల్, ఆయన భార్య సుచిత్ర, కుమారుడు ప్రణవ్, ఫహద్ ఫాజిల్, నజ్రియా, ఫర్హాన్ ఫాజిల్‌తో పాటు కుటుంబ సభ్యులంతా కలిసి కనిపించారు.


మరోవైపు, ఫర్హాన్ ఫాజిల్ కూడా "గుర్తుండియే నైట్" అంటూ అదే ఫోటోలను షేర్ చేశాడు. హృదయపూర్వం సినిమాకు అకిల్ సత్యన్ కథ రాయగా, కొత్త రచయిత సోను టీపీ స్క్రీన్‌ప్లే అందించారు. అనూప్ సత్యన్ అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఈ సినిమాలో మలవికా మోహనన్ కథానాయికగా నటిస్తోంది. మోహన్‌లాల్ గతంలోనూ ఫహద్, నజ్రియాను ఇంటికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.


ఇక మోహన్‌లాల్ కి ప్రస్తుతం డృశ్యం 3తో పాటు, మహేశ్ నారాయణన్ దర్శకత్వంలో ఓ సినిమా, అలాగే నటుడు ఆస్టిన్ డాన్ థామస్ దర్శకత్వంలో మరో సినిమాలను లైన్‌లో పెట్టాడు. అలాగే ఫహద్ కూడా మహేశ్ నారాయణన్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు, ఫహద్ అతి త్వరలో 'ఒడు కుతిరా చాడు కుతిరా', 'మారీసన్' వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Tags:    

Similar News