మెగాస్టార్ జీవిత చరిత్ర 'ముఖరాగం'!
మాలీవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. దాదాపు నాలుగున్నర దశాబ్ధాలగా చిత్ర పరిశ్రమకు సేవలందిస్తున్నారు. మాలీవుడ్ లో తనకంటూ కొన్ని పేజీలు రాసిపె ట్టుకున్నారు. ఇండస్ట్రీలో ఓ లెజెండ్ గా ఎదిగన నటుడు. నటుడిగా 400 చిత్రాలకు చేరువలో ఉన్నారు. మూడు షిప్టులు పనిచేసే నటుడీయన. ఏడాదికి కనీసం ఐదారు సినిమాలైనా ప్రేక్షకుల ముందుకు తీసుకొ స్తుంటారు.
అందుకే 400 సినిమాలకు అతి చేరువలో ఉన్నారు. ప్రస్తుతం మోహన్ లాల్ వయసు 64 ఏళ్లు. అయినా ఆయన సినిమాల స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు. యధావిధిగా ఏడాదికి ఐదారు సినిమాలు ఇప్పటికీ రిలీజ్ చేస్తున్నారు. మమ్ముట్టి రికార్డును బ్రేక్ చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మోహన్ లాల్ జీవిత చరిత్ర ఆధారంగా 'ముఖరాగం'పేరుతో ఓ పుస్తకం రెడీ అవుతుంది. ఇందులో ఆయన 47 సంవ్సతరాల నట జీవి తంలోని ఎన్నో అంశాలు ఉండనున్నాయి.
పుస్తకానికి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసి డిసెంబర్ 25 న ఆవిష్కరించనున్నారు. అయితే ఈ పుస్తకాన్ని ఎవరు రచిస్తున్నారు? అన్నది మాత్రం ఇంకా బయటకు రాలేదు. నటుడిగానే కాదు మోహన్ లాల్ గొప్ప సేవాతత్పరుడు కూడా. విశ్వశాంతి పౌండేషన్ ద్వారా బేబి మెమోరియల్ ఆసుపత్రులతో కలిసి ఆర్ధికంగా వెనుకబడిన పిల్లలకు సబ్సిడీ ధరలకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలను అందిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ మధ్యనే ఈ కార్యక్రమం మొదలు పెట్టారు. మోహన్ లాల్ స్థాపించిన విశ్వశాంతి పౌండేషన్ ద్వారా ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసారు.' బీ ఏ' హీరో పేరుతో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. నట జీవితంతో పాటు...సేవా కార్యక్రమాల గురించి ఆ పుస్తకంలో ప్రస్తావిం చనున్నారు.