• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మోహన్ లాల్ పాన్ఇండియా...

మోహన్ లాల్ పాన్ఇండియా వృషభ టీజర్.. ఎలా ఉందంటే..

| మోహన్ లాల్ పొడవైన జుట్టుతో చేతిలో ఖడ్గం పట్టుకొని కనిపించారు. ఆయనకు సంబంధించిన నాలుగైదు షాట్స్ టీజర్ లో ఉంచారు.

By - M Prashanth
Update: 2025-09-18 13:47 GMT

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ మోస్ట్ అవెయిటెడ్ సినిమా నుంచి ఇవాళ టీజర్ రిలీజైంది. నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను షోభా కపూర్, ఏక్తా కపూర్, పద్మ కపూర్, వరుణ్ మథుర్, సురబీ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్ సంయుక్తంగా నిర్మించారు. 2025 దీపావళి సందర్భంగా సినిమా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సహా, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు.

టీజర్ ఓవరాల్ గా 1.43 నిమిషాల నిడివి ఉంది. టీజర్ గ్రాండ్ బీజీఎమ్ తో షురూ అయ్యింది. ఓపెనింగ్ షాట్ లోనే భారీ నిర్మాణాలు చూపించారు. భారీ సెట్టింగులతో సినిమాను గ్రాండ్ గా డిజైన్ చేశారు. ఒక్క డైలాగ్ లేకుండానే టీజర్ ను ముగించారు. ఇందులో చిన్న పిల్లవాడి గుండెలపై ఓ ముద్ర వేసినట్లు చూపించారు. ఇందులో మోహన్ లాల్ చక్రవర్తిగాలా కనిపించనున్నారు.

మోహన్ లాల్ పొడవైన జుట్టుతో చేతిలో ఖడ్గం పట్టుకొని కనిపించారు. ఆయనకు సంబంధించిన నాలుగైదు షాట్స్ టీజర్ లో ఉంచారు. యోధుడిలా యుద్ధంలో పాల్గొన్న సీన్స్ ఆకట్టుకుంటు్న్నాయి. కత్తి పట్టుకొని శత్రువులను యుద్ధంలో సంహరిస్తున్న సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో మోహన్ లాల్ లుక్ కూడా ఆకట్టుకుంటుంది. మధ్యలో విధి పిలిచినప్పుడు, నెత్తురు కచ్చితంగా సమాధానం చెప్పాలి. అంటూ టెక్ట్స్ రూపంలో ఓ డైలాగ్ ఉంచారు.

రాజ్యానికి రాజుగా శత్రువులను చీల్చి చెండాడిన మోహన్ లాల్ ను టీజర్ ఆఖర్లో ఓ యువకుడి ఒడిలో నిద్రిస్తున్నట్లు చూపించారు. అంటే ఇందులో ఆయన రెండు పాత్రలు పోషిస్తున్నారా అని ఫ్యాన్స్ ఆనుకుంటున్నారు. ఓవరాల్ గా మంచి మ్యూజిక్, క్వాలిటీ విజువల్స్, భారీ సెట్టింగులతో టీజర్ బాగుంది. నిర్మాణ విలువలు కూడా అదిరిపోయానని టీజర్ చూస్తే అర్థం అవుతోంది.

ఈ ప్రాజెక్ట్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోంది. ఈ సినిమా ఆయనకెంతో ప్రత్యేకమని మోహన్ లాల్ ఇప్పటికే చెప్పారు. ఈ సినిమా ఆయన అభిమానులకు అంకితం అని అన్నారు. అందరి మనసును సినిమా తాకుతుందని తెలిపారు. ఈ సినిమా మలయాళ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ స్థాయిలో వసూళ్లు చేస్తుందని అంచనాలు ఉన్నాయి. దీపావళి కానుకగా అక్టోబర్ 16న రిలీజ్ కానుంది.

Full View
Tags:    
  • Mohanlal 
  • MohanlalMovie 
  • MohanlalTeaser 
  • MalayalamCinema 
  • PanIndiaMovie 
  • Diwali2025Release 

Similar News

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

'ఇట్లు అర్జున' హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

2026-11-12 18:00 GMT

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

అనిల్ రావిపూడికి ఉన్న టైమ్ మిగతా దర్శకులకు ఉండటం లేదా...

2026-11-12 17:30 GMT

ఒకప్పుడు ప్రభాస్ ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఉందన్నాడు. ఇప్పుడు చేస్తాడా?

2026-11-12 16:30 GMT

ఈ హీరో పైన అంత నమ్మకం ఏంటి..!

2026-11-12 16:15 GMT

2027లో బ్లాస్టింగ్ మామూలుగా ఉండ‌దు!

2026-11-12 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS