• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బరోజ్ ఫాంటసీ వరల్డ్.. 40...

బరోజ్ ఫాంటసీ వరల్డ్.. 40 ఏళ్లలో ఇలాంటి సినిమా రాలేదు..!

| బరోజ్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మీడియాతో ముచ్చటించారు మోహన్ లాల్ ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

By - Tupaki Desk
Update: 2024-12-21 11:10 GMT

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ లీడ్ రోల్ లో స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బరోజ్ 3డి. ఫాంటసీ అడ్వెంచర్ సినిమాగా వస్తున్న ఈ సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ లో ఆంటోని పెరుంబవూర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. డిసెంబర్ 25న రిలీజ్ అవుతున్న బరోజ్ 3డి తెలుగులో కూడా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్ రిలీజ్ చేస్తున్నారు. బరోజ్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మీడియాతో ముచ్చటించారు మోహన్ లాల్ ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

బరోజ్ జర్నీ ఎలా మొదలైయింది ?

బరోజ్ త్రీడీ ఫాంటసీ ఫిల్మ్. ఇప్పటివరకూ మలయాళం నుంచి మూడు త్రీడీ సినిమాలే వచ్చాయి. అయితే బరోజ్ లో ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని చాలా యూనిక్ గా సినిమాని రూపొందించాం. సినిమా అద్భుతంగా వచ్చింది. విజువల్ వండర్ తో పాటు స్టొరీ టెల్లింగ్ ని రీడిస్కవర్ చేసేలా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరికీ నచ్చేలా వుంటుంది.

ఈ కథకు స్ఫూర్తి ఉందా ?

గార్డియన్‌ ఆఫ్‌ డి గామాస్‌ ట్రెజర్‌ నవలను ఆధారంగా చేసుకొని ఒక ఇమాజనరీ అడ్వెంచర్ కథని రూపొందించాం. వాస్కో డి గామాలో దాగి ఉన్న రహస్య నిధిని కాపాడుతూ వచ్చే బరోజ్‌, ఆ సంపదను దాని నిజమైన వారసుడికి అందించడానికి చేసే ప్రయత్నాలు చాలా అద్భుతంగా వుంటాయి. స్టోరీ టెల్లింగ్ చాలా కొత్త వుంటుంది. ప్రేక్షకులు ఓపెన్ మైండ్ తో వచ్చి ఈ ఇమాజినరీ వరల్డ్ ని ఎక్స్ పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను.

త్రీడీ సినిమా నిర్మించడంలో ఎదురుకున్న సవాళ్ళు ?

త్రీడీ సినిమా చేయడం అంత ఈజీ కాదు. ప్రత్యేకమైన కెమెరాలు అవసరం పడతాయి. అన్ని కెమరాల విజన్ పర్ఫెక్ట్ గా సింక్ అవ్వాలి. ప్రేక్షకుడికి గొప్ప త్రీడీ అనుభూతి ఇవ్వడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.

తొలిసారి దర్శకత్వం వహించడం ఎలా అనిపించింది?

ఈ సినిమాకి ప్రఖ్యాత సాంకేతిక నిపుణులు పని చేశారు. హాలీవుడ్ పాపులర్ కంపోజర్ మార్క్ కిల్లియన్ బీజీఎం ఇచ్చారు. ఆడియన్స్ కి చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది. 12 ఏళ్ల లిడియన్ నాదస్వరం ఈ సినిమాకి సాంగ్స్ కంపోజ్ చేయడం మరో విశేషం.

టాప్ లెన్స్ మ్యాన్ సంతోష్ శివన్ కెమరా వర్క్ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. విజువల్స్ ప్రేక్షకుడికి చాలా కొత్త అనుభూతిని పంచుతాయి. అలాగే గ్రాఫిక్స్ వర్క్ కూడా అద్భుతంగా ఉంటుంది. దీని కోసం యానిమేటెడ్ క్యారెక్టర్స్ కూడా క్రియేట్ చేశాం. చాలా మంది హాలీవుడ్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేశారు

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా కేర్ తీసుకొని చేశాం. గత నలభై ఏళ్ళుగా ఇలాంటి సినిమా రాలేదు. దర్శకుడిగా ఇది నాకు కొత్త అనుభూతి. దర్శకుడిగా తొలి సినిమానే త్రీడీలో చేయడం సవాలుగా అనిపించింది. టీం అందరూ చాలా సపోర్ట్ చేశారు.

మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఆడియన్స్ థియేటర్స్ లో ఓ న్యూ వరల్డ్ ని ఎక్స్ పీరియన్స్ చేస్తారనే నమ్మకం వుంది. తప్పకుండా సినిమా అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది.

Tags:    
  • Barroz3D 
  • Mohanlal 
  • Prithivirajsukumaran 
  • ShaylaMcCaffrey 
  • Komalsharma 
  • Markkillan 
  • AntonyPerumbavoor 
  • Tollywood 
  • Kollywood 
  • Filmindustry 
  • Mythrimoviemakers 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS