ప్యార‌డైజ్ లో మోహ‌న్ బాబు పాత్ర‌పై క‌న్న‌ప్ప డైరెక్ట‌ర్ క్లారిటీ

వ‌రుస హిట్ల‌తో ఫుల్ జోష్ మీదున్న నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం త‌న త‌ర్వాతి సినిమాను ద‌స‌రా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల తో చేస్తున్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-06-27 04:59 GMT

వ‌రుస హిట్ల‌తో ఫుల్ జోష్ మీదున్న నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం త‌న త‌ర్వాతి సినిమాను ద‌స‌రా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల తో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ది ప్యార‌డైజ్ టైటిల్ తో వ‌స్తున్న ఈ సినిమాపై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి. ఆ అంచ‌నాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ సినిమా నుంచి వ‌చ్చిన రా స్టేట్‌మెంట్ కూడా అంద‌రినీ విప‌రీతంగా ఆక‌ట్టుకుంది.

ది ప్యార‌డైజ్ సినిమాలో టాలీవుడ్ సీనియర్ న‌టుడు మోహ‌న్ బాబు న‌టిస్తున్నార‌ని వార్త‌లొస్తున్న సంగ‌తి తెలిసిందే. వార్త‌లైతే వ‌స్తున్నాయి కానీ ఇప్ప‌టివ‌ర‌కు ది ప్యార‌డైజ్ లో మోహ‌న్ బాబు క్యారెక్ట‌ర్ గురించి చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది లేదు. ఈ నేప‌థ్యంలో క‌న్న‌ప్ప డైరెక్ట‌ర్ ఈ విష‌య‌మై క్లారిటీ ఇచ్చారు.

మంచు విష్ణు ప్ర‌ధాన పాత్ర‌లో మోహ‌న్ బాబు నిర్మాత‌గా తెర‌కెక్కిన క‌న్న‌ప్ప సినిమా ప్ర‌మోష‌న్స్ లో ఆ చిత్ర డైరెక్ట‌ర్ ముకేష్ కుమార్ సింగ్, నాని న‌టిస్తున్న‌ ది ప్యార‌డైజ్ సినిమాలో మోహ‌న్ బాబు ప‌వ‌ర్‌ఫుల్ విల‌న్ పాత్ర చేయ‌నున్నార‌ని క‌న్ఫ‌ర్మ్ చేశారు. ఆ సినిమా షూటింగ్ లో మోహ‌న్ బాబును చూశాన‌ని, అత‌ని స్క్రీన్ ప్రెజెన్స్ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌డం ఖాయ‌మ‌ని తెలిపారు.

సోనాలీ కుల‌క‌ర్ణి హీరోయిన్ గా న‌టిస్తున్న ది ప్యార‌డైజ్ సినిమాను సుధాక‌ర్ చెరుకూరి భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తుండ‌గా, 2026, మార్చి 26న పాన్ ఇండియా స్థాయిలో ది ప్యార‌డైజ్ 8 భాష‌ల్లో రిలీజ్ కానుంది. సౌత్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నాని, శ్రీకాంత్ కాంబినేష‌న్ లో గ‌తంలో వ‌చ్చిన ద‌స‌రా మంచి హిట్ అయిన నేప‌థ్యంలో మ‌రోసారి వీరిద్ద‌రూ క‌లిసి ఎలాంటి సినిమాను డెలివ‌ర్ చేస్తారో అని చూడ్డానికి ఆడియ‌న్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

Tags:    

Similar News