వారి వల్లే లైఫ్ లో లవ్ పార్ట్ మిస్ అయ్యా
ప్రియదర్శి, నిహారిక ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సినిమా మిత్రమండలి. రీసెంట్ గానే ఈ సినిమా టీజర్ రిలీజైంది.;
ప్రియదర్శి, నిహారిక ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సినిమా మిత్రమండలి. రీసెంట్ గానే ఈ సినిమా టీజర్ రిలీజైంది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఈవెంట్ లో ఆ చిత్ర నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ సినిమా గురించి, తన వ్యక్తిగత విషయాల గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సందర్భంగా తన లైఫ్ జర్నీలో భాగమైన అల్లు అరవింద్ కు బన్నీ వాస్ థాంక్స్ చెప్పాడు.
నలుగురు కుర్రాళ్లు కూర్చుని సరదాగా మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో మిత్ర మండలి సినిమా అలానే ఉంటుందని, ఇలాంటి సినిమాలు తీయడానికి కారణం జాతి రత్నాలు అని, మిత్ర మండలి కోసం చిత్ర యూనిట్ మొత్తం ఎంతో కష్టపడిందని, సినిమాలోని ప్రతీ ఒక్కరూ అద్భుతంగా వర్క్ చేశారని, సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారని, త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని చెప్పాడు.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ పై బన్నీ వాస్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన లైఫ్ లో లవ్ పార్ట్ మిస్ అయిందంటే దానికి పూర్తి కారణం అల్లు అరవింద్, బన్నీనే అని అన్నాడు. తన లైఫ్ లో పేరెంట్స్ తో కంటే ఎక్కువ టైమ్ అరవింద్ తోనే స్పెండ్ చేశానని, తన ఇంట్లో కంటే ఎక్కువ రోజులు ఆయన ఇంట్లోనే ఉన్నానని, ఆయన నేర్పిన క్రమశిక్షణ వల్లే తాను ఆ స్థాయికి వచ్చానని బన్నీ వాస్ చెప్పాడు.
అరవింద్ గారు ఇచ్చిన సపోర్ట్ లైఫ్ లో మర్చిపోలేనని, ఆయన్ని చూస్తుంటే గాడ్ ఫాదర్ అనే ఫీలింగ్ వస్తుందని, సుమారు 19 ఏళ్ల వయసులో తాను అరవింద్ గారి దగ్గరకు వెళ్లానని, అప్పట్నుంచి తనను బన్నీ దగ్గర పెట్టారని, తన లైఫ్ మొత్తం వాళ్ల దగ్గరే గడిచిపోయిందని చెప్పాడు. మిత్ర మండలి సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు బన్నీ వాస్.
ఎక్కువ టైమ్ యంగ్ పీపుల్ తో టైమ్ స్పెండ్ చేయడం తన బలమని ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు. బన్నీ వాస్ నిర్మించిన ఈ మిత్ర మండలి చూడ్డానికి తాను రెడీగా ఉన్నానని చెప్పిన అరవింద్, సోషల్ మీడియాలో నెటిజన్స్ చేసే కామెంట్స్ ను చూడలేం, చదవలేమని, అందుకే తానొక ఫేక్ అకౌంట్ ను క్రియేట్ చేసుకుని దాంతో అందరినీ ఫాలో అవుతుంటానని అన్నారు.