రెండు కాదు, మిరాయ్‌లో అంతకుమించి సర్‌ప్రైజులు
మిరాయ్ మూవీలో రానా దగ్గుబాటి శ్రీ రాముడి పాత్రలో కనిపించనున్నారట. సినిమాలో ఇదే మెయిన్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.;
హను మాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ సక్సెస్ ను అందుకున్న తేజ సజ్జ ప్రస్తుతం మిరాయ్ అనే యాక్షన్ అడ్వెంచర్ సూపర్ హీరో సినిమాలో నటించిన విషయం తెలిసిందే. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. దానికి తగ్గట్టే మూవీ నుంచి రిలీజైన ట్రైలర్ సినిమాపై ఆడియన్స్ కు ఉన్న అంచనాలను మరింత పెంచింది.
మిరాయ్‌లో రెండు సర్‌ప్రైజులు
రితికా నాయక్, మంచు మనోజ్, శ్రియా శరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఆడియన్స్ ను తప్పక మెప్పిస్తుందని మేకర్స్ ముందు నుంచి చెప్తూ వస్తుండగా, రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మిరాయ్ లో రెండు సర్‌ప్రైజ్‌లు ఉన్నాయని తేజ చెప్పిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం తేజ చెప్పిన ఆ సర్‌ప్రైజులేంటనేది లీకులందుతున్నాయి.
రాముడి పాత్రలో రానా దగ్గుబాటి
మిరాయ్ మూవీలో రానా దగ్గుబాటి శ్రీ రాముడి పాత్రలో కనిపించనున్నారట. సినిమాలో ఇదే మెయిన్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. అంతేకాదు, ఈ మూవీలో రవితేజ, దుల్కర్ సల్మాన్ కూడా భాగమయ్యారని, ఆ ఇద్దరూ స్పెషల్ రోల్స్ లో కనిపించి ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయనున్నారని చెప్తున్నారు. కానీ ఈ విషయం గురించి మేకర్స్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.
సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో విజువల్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటాయని ఇప్పటికే ఆడియన్స్ కు క్లారిటీ వచ్చింది. హను మాన్ తర్వాత తేజ నుంచి వస్తున్న సూపర్ హీరో సినిమా కావడంతో పాటూ అందులో పలువురు స్టార్లు నటించారని తెలియడంతో ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. మిరాయ్ సక్సెస్ పై తేజా సజ్జ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.