యంగ్ హీరో కోసం విదేశీ స్టంట్ మాస్ట‌ర్లు!

యుగాల క్రితం అవ‌రించిన ఓ ఆ ఆయుధ‌మే మిరాయ్ కాన్సెప్ట్ గా తెర‌కెక్కుతోంది.;

Update: 2025-07-01 08:30 GMT

యంగ్ హీరో తేజ స‌జ్జా క‌థాయాకుడిగా కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో భారీ పీరియాడిక్ చిత్రం 'మిరాయ్' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో అంచ‌నాలు భారీగా ఏర్ప డ్డాయి. `హ‌నుమాన్` త‌ర్వాత తేజ పాన్ ఇండియాలో మ‌రో బ్టాస‌ర్ట్ కొడ‌తాడ‌నే అంచ‌నాలు రెట్టింపు అవుతు న్నాయి. చెడు కార‌ణంగా మంచి త‌నానికి ముప్పు వాటిల్లినప్పుడు దారి చూపించే ఓ ఆయుధం పుడుతుంది.

యుగాల క్రితం అవ‌రించిన ఓ ఆ ఆయుధ‌మే మిరాయ్ కాన్సెప్ట్ గా తెర‌కెక్కుతోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జ‌రుగుతోంది. తేజ స‌జ్జాపై కీల‌క‌మైన యాక్ష‌ణ్ స‌న్నివేశాల‌ను చిత్రీక రిస్తున్నారు. దీనిలో బాగంగా టాలీవుడ్-హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్లు క‌లిసి ప‌నిచేస్తున్నారు. న‌భాకాంత్, రాబిన్ సుబ్బుతో పాటు విదేశీ స్టంట్ మాస్ట‌ర్ల ఆధ్య‌ర్యంలో ఈ భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు.

ఇందులో కొన్ని సాహ‌సోపేత‌మ‌న స‌న్నివేశాల విష‌యంలోనే తేజ ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌కుండా పాల్గొంటు న్నాడు. ఈ ఫైట్ సీన్ కోసం స్టంట్ మాస్ట‌ర్ల ఆధ్వ‌ర్యంలో కొంత ముంద‌స్తు శిక్ష‌ణ కూడా తీసుకున్నాడుట‌. ట్రైనింగ్ అనంత‌ర‌మే ఆ స‌న్నివేశాలు పూర్తి చేస్తున్నాడు. బాడీ లుక్ ప‌రంగానూ తేజ మార్పులు తీసుకొ చ్చాడు. మునుప‌టి చిత్రం కంటే కాస్త బ‌రువు పెరిగి మ‌ళ్లీ స్లిమ్ లుక్ లోకి మారాడు.

తేజ‌కు విల‌న్ గా మంచు మ‌నోజ్ న‌టిస్తున్నాడు. సినిమాలో ఈ పాత్ర కూడా చాలా బ‌లంగా ఉంటుంద‌ని ప్ర‌చార చిత్రాల‌తో అర్ద‌మ‌వుతుంది. ప్ర‌తి నాయ‌కుడి ఆహార్యంలో మ‌నోజ్ ప‌ర్పెక్ట్ గా సెట్ అయ్యాడు. హీరో ను మంచిని ఎలివేష‌న్ మిరాయ్ రూపంలో మ‌నోజ్ కు ద‌క్కుతుంది. విల‌న్ గా స‌క్సెస్ అయితే మ‌నోజ్ కెరీర్ కొత్త ట‌ర్నింగ్ తీసుకున్న‌ట్లే.

Tags:    

Similar News