స్టార్ హీరో భార్య ఒంట‌రిత‌నం?

అయితే తాను చాలా చిన్న వ‌య‌సులో పెళ్లి చేసుకోవ‌డం వ‌ల్ల స్నేహ సంబంధాల‌ను కోల్పోయాన‌ని మీరా రాజ్ పుత్ ఇటీవ‌లి ఇంట‌ర్వ్యూలో ఆవేద‌న చెందింది.;

Update: 2025-05-04 15:30 GMT

త‌న‌కంటే 14 సంవత్స‌రాలు వ‌య‌సులో పెద్ద వాడైన హీరో షాహిద్ క‌పూర్ ని పెళ్లాడింది మీరా రాజ్ పుత్. అప్ప‌టికే క‌రీనాతో డేటింగ్ ముగించిన షాహిద్ కొన్నేళ్ల పాటు ఒంట‌రిగా ఉన్నాడు. చివ‌రిగా దిల్లీకి చెందిన 20ఏళ్ల రాజ్ పుత్ బ్యూటీని 34 వ‌య‌సులో పెళ్లాడాడు.

అయితే తాను చాలా చిన్న వ‌య‌సులో పెళ్లి చేసుకోవ‌డం వ‌ల్ల స్నేహ సంబంధాల‌ను కోల్పోయాన‌ని మీరా రాజ్ పుత్ ఇటీవ‌లి ఇంట‌ర్వ్యూలో ఆవేద‌న చెందింది. పెళ్లి త‌ర్వాత త‌న దారి వేరైంది. అందువ‌ల్ల కాలేజ్ స్నేహితుల‌తో సంబంధాలు కొన‌సాగ‌లేదు. ఎవ‌రి దారిన వారు వెళ్లిపోయాం. కాలేజ్, ఉద్యోగ జీవితం, ల‌క్ష్యం అంటూ ముందుకు సాగుతున్న స్నేహితుల‌ను చూసి కుళ్లుకున్నాన‌ని, త‌న‌కు ఆ అవ‌కాశం లేనందున చాలా బాధ‌ప‌డ్డాన‌ని కూడా మీరా రాజ్‌పుత్ వెల్ల‌డించింది. తాను చిన్న వ‌య‌సులో పెళ్లి చేసుకోవ‌డం వ‌ల్ల భావోద్వేగాల ప‌రంగా స‌వాళ్ల‌ను ఎదుర్కొన్న‌ట్టు మీరా తెలిపింది. వైవాహిక‌ జీవితానికి అలవాటు పడినప్పుడు, ఫ్రెండ్స్ లేక‌పోవ‌డం వ‌ల్ల‌ తనకు ఎదురైన ఒంటరితనం ఎంతగా స‌వాల్‌గా మారిందో కూడా తెలిపింది. త‌న చుట్టూ స్నేహితులు ఎవ‌రూ లేకుపోవ‌డం లోటుగా అనిపించింద‌ని తెలిపింది. స్వేచ్ఛ‌గా షికార్ల‌కు వెళ్లే స్నేహితుల‌ను చూసి చాలా కుళ్లుకున్నాన‌ని అంది.

వ్య‌క్తిగ‌త ఫ్యామిలీ జీవితంలో ఎలాంటి లోటు లేక‌పోయినా, సంతృప్తిక‌రంగా ఉన్నా కానీ, స్నేహితుల‌తో దూర‌మ‌వ్వ‌డాన్ని త‌ట్టుకోలేక‌పోయాన‌ని ఒంట‌రిత‌నం ఫీల‌య్యాన‌ని మీరా చెప్పారు. అయితే త‌న స్నేహితులంతా అవాయిడ్ చేస్తోంద‌ని భావించార‌ని, చివ‌రికి వారు కూడా పెళ్లితో జీవితంలో సెటిల‌య్యాక త‌న‌ను అర్థం చేసుకున్నార‌ని కూడా మీరా రాజ్ పుత్ వెల్ల‌డించింది.

Tags:    

Similar News