ఎక్కడ మిస్ అయ్యాం? నాని సినిమాపై డైరెక్టర్ ఓపెన్ టాక్
ఇటీవల తన తాజా చిత్రం 'కొరియన్ కనకరాజు' సక్సెస్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మేర్లపాక గాంధీ, 'కృష్ణార్జున యుద్ధం' ఎక్కడ మిస్ అయిందో, ఎందుకు ఫ్లాప్ అయిందో తుపాకీ న్యూస్ కి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో చాలా ఓపెన్‌గా మాట్లాడారు.
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని తో దర్శకుడు మేర్లపాక గాంధీ తీసిన మూవీ ‘కృష్ణార్జున యుద్ధం’. నాని ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాన్ని సాధించలేకపోయింది. కాగా, ఇటీవల తన తాజా చిత్రం 'కొరియన్ కనకరాజు' సక్సెస్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మేర్లపాక గాంధీ, 'కృష్ణార్జున యుద్ధం' ఎక్కడ మిస్ అయిందో, ఎందుకు ఫ్లాప్ అయిందో తుపాకీ న్యూస్ కి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో చాలా ఓపెన్‌గా మాట్లాడారు.
ఆ ఒక్క క్యారెక్టర్ లేకపోతే బ్లాక్‌బస్టర్:
తుపాకీ న్యూస్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన గాంధీ, నాని అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. "సినిమాలో నుంచి రాక్‌స్టార్ 'అర్జున్' క్యారెక్టర్‌ను తీసేసి ఉంటే.. అది ఖచ్చితంగా పెద్ద బ్లాక్‌బస్టర్ అయ్యేదని నాని గారు కూడా స్టేజ్‌పై చెప్పారు. అందులో ఊరి అబ్బాయి అయిన 'కృష్ణ' పాత్ర ఎంతో ఎనర్జిటిక్‌గా, చిత్తూరు యాసతో ముచ్చటగా ఉండి అందరినీ అలరించింది. కానీ అర్జున్ పాత్ర అనుకున్నంతగా వర్కవుట్ కాలేదు. ఇద్దరు హీరోల మధ్య కన్ఫ్యూజన్ డ్రామా చేద్దామని అనుకున్నాం కానీ అది రివర్స్ అయింది" అని తెలిపారు.
మూవీ నేమ్ చేంజ్ :
ఇక సినిమా మళ్లీ మార్చే ఛాన్స్ వస్తే పేరు మార్చేసేవాడినని గాంధీ నవ్వుతూ చెప్పారు. నాని గారు అన్నట్లుగానే అర్జున్ పాత్రను పక్కన పెట్టి, కేవలం ఆ ఊరి అమాయకపు కృష్ణ పాత్రతోనే కథ నడిపి ఉంటే బాగుండేది. ఇక టైటిల్ కూడా ‘కృష్ణార్జున యుద్ధం’ కాకుండా ‘కృష్ణ యుద్ధం’ అని పెట్టి ఉంటే కథ సోల్‌కి సెట్ అయ్యేది. ప్రేక్షకులు ఏ క్యారెక్టర్‌ను ఎంజాయ్ చేస్తారో దాంతోనే వెళ్లడం మంచిదని దీని ద్వారా అర్థమైంది" అని వివరించారు.
నా బలం కామెడీయే:
తన సినిమాల్లో కామెడీ ప్రాధాన్యత గురించి చెప్తూ, "నా మొదటి షార్ట్ ఫిలిం ‘కర్మరా దేవుడా’ నుంచి కామెడీ బాగా వర్కవుట్ అయింది. ఇక మొదట్లో కొన్ని సీరియస్ కథలు అనుకున్నప్పటికీ, నాకు హాస్యం బాగా రాయడం, ప్రెజెంట్ చేయడం వచ్చనే నమ్మకం కుదిరింది. అందుకే నా మొదటి సినిమా నుంచి ఈ రోజు వచ్చిన 'కొరియన్ కనకరాజు' వరకు కామెడీని నమ్ముకునే సినిమాలు తీస్తున్నాను" అని స్పష్టం చేశారు.
'కొరియన్ కనకరాజు'తో మళ్లీ ట్రాక్‌లోకి:
ఇక ఇటీవల ఆగస్టు 7న విడుదలైన హారర్ కామెడీ 'కొరియన్ కనకరాజు'తో గాంధీ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు. వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా నటించిన ఈ చిత్రం మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. వరుణ్ తేజ్ నటన, కమెడియన్ సత్య కామెడీ టైమింగ్ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలవడంతో, వరుస ఫ్లాపుల్లో ఉన్న వరుణ్ తేజ్‌కు ఈ సినిమా మంచి ఉపశమనాన్ని, విజయాన్ని అందించింది.
చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగడమే నిజమైన దర్శకుడి లక్షణం అని మేర్లపాక గాంధీ ప్ర నిరూపించారు. 'కృష్ణార్జున యుద్ధం' విషయంలో ఎక్కడ పొరపాటు జరిగిందో నిర్మొహమాటంగా ఒప్పుకుంటూనే, తన బలాన్ని నమ్ముకుని 'కొరియన్ కనకరాజు'తో మరోసారి ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వులు పంచారు. భవిష్యత్తులో కూడా ఆయన నుంచి ఇలాంటి సరదా వినోదాత్మక సినిమాలు మరిన్ని రావాలని ఆశిద్దాం.