ఆత్మ‌హ‌త్య చేసుకున్న టాప్- 10 బుల్లితెర న‌టీన‌టులు

వెండితెర - బుల్లితెరపై తమ నటనతో లక్షలాది మంది ప్రేక్షకులను అలరించిన ఎంతో మంది ప్రతిభావంతులైన నటీనటులు కెరీర్ ఆరంభంలోనే జీవితాన్ని అర్ధాంతరంగా ముగించడం ఇండస్ట్రీని

Update: 2026-06-17 03:21 GMT

గత కొన్ని ఏళ్లుగా భారతీయ వినోద పరిశ్రమను వరుస ఆత్మహత్యలు తీవ్రంగా కుదిపేస్తున్నాయి. గ్లామర్ ప్రపంచంలో తళుకులీనే నటీనటుల జీవితాల వెనుక ఎంతటి మానసిక ఒత్తిడి, నిరాశ దాగి ఉన్నాయో ఈ విషాద సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. వెండితెర - బుల్లితెరపై తమ నటనతో లక్షలాది మంది ప్రేక్షకులను అలరించిన ఎంతో మంది ప్రతిభావంతులైన నటీనటులు కెరీర్ ఆరంభంలోనే జీవితాన్ని అర్ధాంతరంగా ముగించడం ఇండస్ట్రీని , అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

సినీ పరిశ్రమలో చోటుచేసుకున్న అత్యంత సంచలనాత్మక మరణాలలో బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఒకటి. 2020 జూన్‌లో ముంబైలోని తన నివాసంలో ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన తర్వాత చిత్ర పరిశ్రమలో ఉండే నెపోటిజం, ఒత్తిళ్లు , మానసిక ఆరోగ్యంపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. సుశాంత్ మరణం తెచ్చిన చేదు జ్ఞాపకాల నుండి కోలుకోకముందే బుల్లితెరకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు కూడా అదే రీతిన బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డ‌టం ఆందోళన కలిగించింది.

టెలివిజన్ రంగంలో స్టార్‌గా దూసుకుపోతున్న యువ నటి తునీషా శర్మ మరణం కూడా పరిశ్రమను షాక్‌కు గురిచేసింది. కేవలం 20 ఏళ్ల వయసులోనే ఈ న‌టి ఒక టీవీ సీరియల్ షూటింగ్ సెట్‌లోని మేకప్ రూమ్‌లోనే ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. అలాగే `ససురాల్ సిమర్ కా` ఫేమ్ వైశాలి టక్కర్ ఇండోర్‌లోని తన నివాసంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన వేధింపులే ఆమె మరణానికి కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి.

వీరితో పాటు `బాలికా వధు` (చిన్నారి పెళ్లికూతురు) సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రత్యూష బెనర్జీ, ప్రముఖ నటుడు కుశాల్ పంజాబీ, నటి సెజల్ శర్మ వంటి ఎంతో మంది బుల్లితెర నటీనటులు వేర్వేరు కారణాలతో ఆత్మహత్యలకు పాల్ప‌డ్డారు. ఇక తెలుగు చిత్ర‌సీమ‌లో ఉద‌య్ కిర‌ణ్ లాంటి వ‌ర్థ‌మాన న‌టుడు చిన్న వ‌య‌సులో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌టం అప్ప‌ట్లో ఎంత‌గానో క‌ల‌చివేసింది. తెలుగు - త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో ఈ త‌ర‌హా మ‌ర‌ణాలు ఎప్ప‌టిక‌ప్పుడు మీడియా హెడ్ లైన్స్ లో కొస్తూనే ఉన్నాయి. గ్లామర్ పరిశ్రమలో కనిపించే నిరంతర పోటీ... అవకాశాలు తగ్గిపోవడం... ఆర్థిక ఇబ్బందులు లేదా విఫలమైన ప్రేమ బంధాలు వంటి వ్యక్తిగత కారణాలు వీరిని తీవ్రమైన మానసిక ఒత్తిడిలోకి నెట్టి చివరికి ఇలాంటి విపరీత నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వరసగా జరుగుతున్న ఈ ఆత్మహత్యలు వినోద పరిశ్రమలో కళాకారుల భద్రత - మానసిక ఆరోగ్య రక్షణ వ్యవస్థలపై సందేహాల్ని రేకెత్తిస్తున్నాయి. నటీనటులు ఎదుర్కొనే ఒత్తిడిని అధిగమించడానికి వారికి కౌన్సిలింగ్ అందించడానికి పరిశ్రమలో ఒక ప్రత్యేక సహాయక వ్యవస్థ (సపోర్ట్ సిస్టమ్) ఏర్పాటు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువ నటీనటులు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం పరిశ్రమకు తీరని లోటని, ఇకనైనా ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News