చిరంజీవి సర్జా వర్ధంతి వేళ క్రేజీ ఆఫర్!
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో `జైలర్`2 భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్నసంగతి తెలిసిందే.;
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో `జైలర్`2 భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్నసంగతి తెలిసిందే. భారీ కాన్సాస్ పై రూపొందుతున్న చిత్రమిది. మిథున్ చక్రవర్తి, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, విజయ్ సేతుపతి, వినాయకన్ లాంటి స్టార్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇంకా మొదటి భాగంలో కనిపించిన పాత్రలన్నీ రెండవ భాగంలోనూ కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ క్రేజీ ప్రాజెక్టులో కన్నడ నటి మేఘనా రాజ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగతా మేఘన భర్త, దివంగత నటుడు చిరంజీవి సర్జా వర్ధంతి రోజునే ఈ విషయాన్ని ఆమె పరోక్షంగా ధృవీకరించడం అభిమానులను భావో ద్వేగానికి గురిచేస్తోంది.
మేఘనా రాజ్ గత కొన్నేళ్లుగా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. భర్త చిరంజీవి సర్జా అకాల మరణం తర్వాత ఆమె సినిమాలకు కొంత కాలం దూరంగా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న మేఘనకు రజనీకాంత్ వంటి దిగ్గజ నటుడి సినిమాలో అవకాశం రావడం ఆమె కెరీర్‌కు పెద్ద బూస్ట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాతో ఆమె మళ్ళీ తమిళ, తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. మేఘనా రాజ్ కుటుంబానికి రజనీకాంత్ అంటే ఎంతో అభిమానం. ఆమె భర్త చిరంజీవి సర్జా కూడా రజనీకాంత్‌కు పెద్ద ఫ్యాన్.
చిరంజీవి జ్ఞాపకార్థం జరుపుకునే ప్రత్యేక రోజున ఇలాంటి వార్త అప్డేట్ రావడం యాదృచ్ఛికమే అయినా? అది తమ కుటుంబానికి దక్కిన గౌరవంగా మేఘనా భావిస్తున్నారు. రజనీకాంత్ సినిమాతో తన రీ-ఎంట్రీ గ్రాండ్‌గా ఉంటుందని సోషల్ మీడియా పోస్ట్‌లు సూచిస్తున్నాయి. దీంతో `జైలర్ 2`లో మేఘనా రాజ్ పాత్ర ఎలా ఉండబోతుందనే దానిపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. మొదటి భాగంలో రమ్యకృష్ణ పోషించిన పాత్ర తరహాలోనే? రెండో భాగంలో మేఘనా పాత్రకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందని వినిపిస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ తన సినిమాల్లో ప్రతి పాత్రను వైవిధ్యంగా డిజైన్ చేస్తారు. కాబట్టి మేఘనా రాజ్‌ను ఓ పవర్‌ఫుల్ లేదా ఎమోషనల్ పాత్రలో చూసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ వార్త బయటకు రావడంతో? సోషల్ మీడియాలో మేఘనా రాజ్‌కు అభినం దనలు వెల్లువెత్తుతున్నాయి. `చిరంజీవి సర్జా ఆశీస్సులు ఎప్పుడూ నీపై ఉంటాయి. స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ మేఘనా` అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వ్యక్తిగత బాధను దిగమింగుకుని తన కొడుకు రాయన్ సర్జా కోసం మళ్ళీ కెరీర్‌పై దృష్టి పెట్టిన మేఘన పట్టుదలను కొనియాడుతున్నారు. రజనీకాంత్ సినిమాలో అవకాశం రావడం అనేది ఆమె కష్టానికి దక్కిన ప్రతిఫలమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. `జైలర్ 2`పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. తాజాగా మేఘనా రాజ్ వంటి ప్రతిభా వంతమైన నటి తోడవ్వడం సినిమాకు మరింత బలాన్ని ఇస్తుంది. రజనీకాంత్ మేజిక్, నెల్సన్ టేకింగ్, మేఘనా రాజ్ ఎమోషనల్ కమ్‌బ్యాక్.. ఇవన్నీ కలిసి `జైలర్ 2`ని బాక్సాఫీస్ వద్ద మరో వండర్‌గా మారుస్తాయేమో చూడాలి.