మెగా ఫ్యాన్స్ కి మరో గూస్ బంప్స్ న్యూస్..!

మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ సూపర్ హిట్ అవ్వడం మెగా ఫ్యాన్స్ కి ఒక మంచి జోష్ అందించింది.;

Update: 2026-01-19 06:01 GMT

మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ సూపర్ హిట్ అవ్వడం మెగా ఫ్యాన్స్ కి ఒక మంచి జోష్ అందించింది. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి ఎనర్జీకి సరిపడే స్టోరీ పడలేదన్న అసంతృప్తి ఫ్యాన్స్ లో ఉంది. మధ్యలో గాడ్ ఫాదర్, భోళా శంకర్ లాంటి సినిమాలు చూసి మెగా బాస్ ఇలాంటి సినిమాలు చేస్తున్నాడేంటని ఫ్యాన్స్ కంగారు పడ్డారు. కానీ MSG సినిమా చూసి 70 ఏళ్లలో కూడా మెగాస్టార్ గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ అయ్యింది. ఓజీ సినిమాతో ఎలాగైతే పవర్ స్టార్ ఫ్యాన్స్ తమ ఆకలి తీరిందని ఫీల్ అయ్యారో.. మన శంకర వర ప్రసాద్ సినిమాతో మెగా ఫ్యాన్స్ అంతకన్నా ఎక్కువ సంతోషంగా ఉన్నారు.

సినిమా విజువల్ ఎఫెక్ట్స్ తో భారీ రేంజ్ విశ్వంభర..

సంక్రాంతి రేసులో బ్లాక్ బస్టర్ హిట్ తో దూసుకెళ్తుంది మన శంకర వరప్రసాద్. ఐతే ఈ సినిమా సూపర్ హిట్ జోష్ లో ఉన్న మెగాస్టార్ తన నెక్స్ట్ సినిమా విశ్వంభర రిలీజ్ ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ సమ్మర్ కి విశ్వంభర రిలీజ్ ఫిక్స్ చేశారు. వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ తో భారీ రేంజ్ లో ఉండబోతుంది. ఈ ఇయర్ లోనే ఆ సినిమా రిలీజ్ అవుతుండగా ఆ మూవీతో కూడా బ్లాక్ బస్టర్ టార్గెట్ పెట్టుకున్నారు మెగాస్టార్.

ఐతే విశ్వంభర మాత్రమే కాదు బాబీతో చిరంజీవి చేసే సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లబోతుంది. భోళా శంకర్ తర్వాత 2 ఇయర్స్ గ్యాప్ ఇచ్చిన చిరంజీవి ఈ ఏడాది మాత్రం రెండు సినిమాలు పక్కా రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. బాబీ సినిమాను కూడా అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసి ఇదే ఏడాది రిలీజ్ చేసే ప్లానింగ్ ఉందట. అదే జరిగితే 2026 మెగాస్టార్ నుంచి 3 సినిమాలు వచ్చినట్టు అవుతుంది.

మాస్ స్టామినా చూపించాలని..

బాబీతో ఆల్రెడీ వాల్తేరు వీరయ్య సినిమా చేశారు మెగాస్టార్. ఆ సినిమా ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేసింది. ఐతే ఈసారి బాబీ మెగా బాస్ తో ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడని టాక్. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా తో మరోసారి తన మాస్ స్టామినా చూపించాలని ఫిక్స్ అయ్యారు మెగాస్టార్. ఐతే బాబీ సినిమా కుదిరితే దసరా లేదా దీపావలికి తీసుకొచ్చేలా ఉన్నారు. అప్పటికీ కుదరకపోతే 2027 సంక్రాంతికి మెగా మూవీ వచ్చేలా చేయాలని చూస్తున్నారు.

MSGని ఫ్యాన్స్ రిసీవ్ చేసుకున్న మూమెంట్ చూసి మెగాస్టార్ కూడా చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఇదే ఊపుతో విశ్వంభర కూడా హిట్ పడితే 10 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ రేంజ్ హడావిడి మళ్లీ వింటేజ్ మెగాస్టార్ వైబ్ ని గుర్తు చేస్తున్నాయని చెప్పొచ్చు.

Tags:    

Similar News