• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కిరాక్ లుక్స్ తో ఫ్యాన్స్...

కిరాక్ లుక్స్ తో ఫ్యాన్స్ కి సూపర్ కిక్..!

| ఇక గేం చేంజర్ తర్వాత రాం చరణ్ బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కూడా పీరియాడికల్ మూవీగా వస్తుందని తెలుస్తుంది

By - Tupaki Desk
Update: 2024-02-08 16:30 GMT

RRR తో గ్లోబల్ వైడ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రాం చరణ్ అంతకుముందు వరకు కేవలం తెలుగు హీరోగానే పేరు తెచ్చుకోగా ట్రిపుల్ ఆర్ తో నెక్స్ట్ లెవెల్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఆర్.ఆర్.ఆర్ తర్వాత గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న రాం చరణ్ ఆ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ ని షేక్ చేయాలని చూస్తున్నాడు. శంకర్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ అంచనాలను మించి ఉంటుందని అంటున్నారు.

ఇక గేం చేంజర్ తర్వాత రాం చరణ్ బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కూడా పీరియాడికల్ మూవీగా వస్తుందని తెలుస్తుంది. ఉప్పెనతో సెన్సేషనల్ హిట్ అందుకున్న బుచ్చి బాబు చరణ్ సినిమాతో భారీ స్కెచ్ వేసినట్టు టాక్. సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని చెబుతున్నారు. ఈ సినిమా కోసం చరణ్ మేకోవర్ కొత్తగా ఉంటుందని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే చరణ్ లేటెస్ట్ లుక్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఒకరైన శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి ఈమధ్యనే హీరోగా పరిచయం అయ్యాడు. రాజు గారి ఫ్యామిలీ నుంచి హీరోగా ఆశిష్ రౌడీ బాయ్స్ సినిమాతో మెప్పించాడు. తన సెకండ్ సినిమా సెల్ఫిష్ గా రాబోతున్నాడు. ఇక అయితే ఆశిష్ రెడ్డి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు.

ఆశిష్ వెడ్డింగ్ ఇన్విటేషన్ ని శిరీష్ ఆశిష్ కలిసి రాం చరణ్ కి అందించారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చరణ్ ఈ ఫోటో లో అదరగొట్టేస్తున్నాడు. చరణ్ స్టైలిష్ లుక్ మెగా ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. గేమ్ చేంజర్ లో కూడా చరణ్ క్రేజీ లుక్స్ తో కనిపించనున్నారు. అయితే చరణ్ ఈ న్యూ లుక్స్ తో ఆడియన్స్ సూపర్ అనేస్తున్నారు. బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా కోసమే చరణ్ ఈ లుక్ తో ఉంటున్నారని తెలుస్తుంది. RRR తర్వాత ఆచార్యతో ఫ్లాప్ అందుకున్న చరణ్ గేమ్ చేంజర్ తో పెద్ద టార్గెట్ పెట్టుకున్నాడు.

What is your opinion on Yatra 2 movie? #Yatra2 #Yatra2Movie #Yatra2movieReview #Mammootty #Jiiva #Tollywood #Tupaki

— Tupaki (@tupaki_official) February 8, 2024
Tags:    
  • Ramcharan 
  • Gamechangerfilm 
  • Filmindustry 
  • Dilraju 
  • Shankar 
  • Buchibabu 
  • Megapowerstar 

Similar News

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

Copyright @2026

Powered by Blink CMS