చిరూ కోసం ముస్సోరికి న‌య‌న్!

అనుకున్న దాని కంటే ఒక రోజు ముందుగానే మొద‌టి షెడ్యూల్ ను పూర్తి చేసిన అనిల్, ఈ సినిమా రెండో షెడ్యూల్ కోసం ముస్సోరికి వెళ్లిన సంగతి తెలిసిందే.;

Update: 2025-06-16 11:27 GMT

టాలీవుడ్ హిట్ మిష‌న్ అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా మెగా157. మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాలో న‌య‌న‌తార హీరోయిన్ గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతికి వ‌స్తున్నాం బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత అనిల్ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో పాటూ అందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తుండ‌టంతో ఈ సినిమాపై అంద‌రికీ భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

అనిల్ ఏ సినిమానైనా త్వ‌ర‌గా పూర్తి చేస్తాడ‌నే పేరుంది. ఉగాదికి సినిమాను పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లుపెట్టిన అనిల్, ఆ త‌ర్వాత వెంట‌నే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఆల్రెడీ మంచి అంచ‌నాలున్న ఈ సినిమాలో న‌య‌న‌తార‌ను రంగంలోకి దింప‌డ‌మే కాకుండా ఆమెతో ఏకంగా ప్ర‌మోష‌న‌ల్ వీడియో కూడా చేయించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు అనిల్.

అనుకున్న దాని కంటే ఒక రోజు ముందుగానే మొద‌టి షెడ్యూల్ ను పూర్తి చేసిన అనిల్, ఈ సినిమా రెండో షెడ్యూల్ కోసం ముస్సోరికి వెళ్లిన సంగతి తెలిసిందే. సినిమాను మొద‌లుపెట్ట‌డ‌మే లేట్ అనే రీతిలో అనిల్ ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు. ఇప్ప‌టికే ముస్సోరిలో షూటింగ్ మొద‌ల‌వ‌గా, ఈ షెడ్యూల్ లో రేప‌టి నుంచి హీరోయిన్ న‌య‌న‌తార కూడా జాయిన్ అవ‌నున్నట్టు తెలుస్తోంది.

మెగా157 షూటింగ్ మ‌రో రెండు రోజుల పాటూ ముస్సోరిలోనే జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం. ముస్సోరి షెడ్యూల్ లో చిరంజీవి, న‌య‌న‌తార‌పై ప‌లు కీల‌క స‌న్నివేశాల‌ను అనిల్ తెర‌కెక్కించ‌నున్నాడట‌. వీలైనంత త్వ‌ర‌గా సినిమాను పూర్తి చేసి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్, ప్ర‌మోష‌న్స్ కు ఎక్కువ టైమ్ కేటాయించేలా అనిల్ ప్లాన్ చేస్తున్నాడ‌ని స‌మాచారం. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సాహు గార‌పాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా, 2026 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Tags:    

Similar News