మెగా కామెడీ ట్రాక్.. కడుపు నొప్పి పుట్టే నవ్వులా..?
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా మెగాస్టార్ చిరంజీవితో లాక్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2026 సంక్రాంతి టార్గెట్ కి సిద్ధం చేస్తున్నారు.;
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా మెగాస్టార్ చిరంజీవితో లాక్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2026 సంక్రాంతి టార్గెట్ కి సిద్ధం చేస్తున్నారు. పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం వరకు తీసిన 8 సినిమాలు సక్సెస్ అందుకున్న అనిల్ రావిపూడి ఆడియన్స్ పల్స్ పట్టేశాడని చెప్పొచ్చు. స్టార్ ఇమేజ్ ని బట్టి ఆ స్టార్ నుంచి ఫ్యాన్స్ ఆశించే అంశాలు ఇస్తూనే తన మార్క్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు అనిల్ రావిపూడి.
మెగా 157 సినిమా విషయంలో కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నాడట దర్శకుడు అనిల్. మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్, ఫైట్స్ గురించి అందరికీ తెలిసిందే. చిరు డ్యాన్స్ చేస్తే ఫ్యాన్స్ కి పూనకాలే.. ఇక ఫైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్. వాటితో పాటు చిరంజీవిలోని కామెడీ యాంగిల్ కూడా అదిరిపోతుంది. ఆయన టైమింగ్ ని పట్టుకోవాలే కానీ అదిరిపోతుంది. అనిల్ చిరులోని ఆ టైమింగ్ ని పట్టుకుని మెగా 157 సినిమాను చేస్తున్నారట.
అనిల్ సినిమా అంటే ముఖ్యంగా కామెడీ అదిరిపోతుంది. ఇటు మెగాస్టార్ ఉన్నాడు కాబట్టి యాక్షన్ ని కూడా మిక్స్ చేస్తున్నాడట. ఐతే మెగా 157 లో ఒక ట్రాక్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో వచ్చిందని అంటున్నారు. అనిల్ మార్క్ కామెడీ ట్రాక్ గా అది వస్తుందట. అంతేకాదు సినిమాలో ఈ ట్రాక్ వచ్చినంతసేపు థియేటర్ లో ఆడియన్స్ కడుపు నొప్పి వచ్చే రేంజ్ లో నవ్వుతారని అంటున్నారు. స్క్రిప్ట్ దశలోనే ఇది సూపర్ గా వర్క్ అవుట్ అవుతుందని అనిపిస్తుండగా రష్ చూస్తే ఇక అందరు నవ్వు ఆపులేకపోతారని అంటున్నారు.
అనిల్ రావిపూడి మీద ఏ నమ్మకంతో చిరంజీవి ఈ ప్రాజెక్ట్ ఇచ్చారో దానికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా చేస్తున్నారని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి లోని కామెడీ యాంగిల్ ని వాడుకుంటూ మెగా ఫ్యాన్స్ కి కావాల్సిన మాస్ అంశాలను కవర్ చేస్తున్నారట. మొత్తానికి మెగా 157 క్లాస్ మాస్ అన్న తేడా లేకుండా అందరినీ కవర్ చేసేలా ఉంటుందని చెప్పుకుంటున్నారు.
చిరుతో సినిమాను అనుకున్న టైం కి పూర్తి చేసి రిలీజ్ టార్గెట్ ని కూడా సక్సెస్ ఫుల్ గా అందుకోవాలని చూస్తున్నాడు అనిల్ రావిపూడి. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ నుంచి త్వరలోనే టీజర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.