సమ్మర్ లో పవన్, చరణ్, చిరు.. 1000 కోట్లు?

టాలీవుడ్ మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలంతా ఇప్పుడు తమ అప్ కమింగ్ మూవీస్ తో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.;

Update: 2025-10-09 17:30 GMT

టాలీవుడ్ మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలంతా ఇప్పుడు తమ అప్ కమింగ్ మూవీస్ తో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రీసెంట్ గా ఓజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మిగతా ఆడియన్స్ కు కంప్లీట్ గా సాటిస్ఫై చేయలేకపోయినా.. ఫ్యాన్స్ కు మాత్రం సినిమా ఓ రేంజ్ లో నచ్చేసింది.

సింపుల్ గా చెప్పాలంటే పండుగ చేసుకున్నారు. అయితే పవన్ చేతిలో ఉన్న మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. పవన్ చిత్రీకరణ పార్ట్ కంప్లీట్ అవ్వగా.. 2026 సమ్మర్ లో రిలీజ్ కానుంది.

అయితే పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ తో రానుండగా.. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. విశ్వంభర, పెద్ది సినిమాలతో సందడి చేయనున్నారు విశ్వంభర మూవీ సమ్మర్ లో రిలీజ్ అవ్వనుందని ఇటీవల చిరు ప్రకటించగా.. చరణ్ పెద్ది సినిమా మార్చి 27వ తేదీన గ్రాండ్ గా విడుదల కానున్నట్లు ఆ మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు.

అలా పవన్, చిరు, చరణ్.. ముగ్గురూ కూడా సమ్మర్ లో సందడి చేయనున్నారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి రూ.150 కోట్ల బిజినెస్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సినిమా టాక్ బాగుంటే ఇంకా హైప్ క్రియేట్ అయితే కలెక్షన్స్ లెక్క రూ.200 కోట్లకు చేరవచ్చని అంటున్నారు. విశ్వంభర కూడా అదే రేంజ్ టార్గెట్ తో ఉందని తెలుస్తోంది.

అదే సమయంలో పెద్ది మూవీకి రూ.350 కోట్లకు పైగా బిజినెస్ జరగనున్నట్లు సమాచారం. కానీ ఆ మూవీ మేకర్స్ మాత్రం బాక్సాఫీస్ వద్ద టార్గెట్ ను 600 కోట్లకు పైనే పెట్టుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా మూడు సినిమాలు కలిపి భారీగా బిజినెస్ చేయనున్నాయి.. ముగ్గురు మెగా హీరోలు కలిసి సమ్మర్ లో రూ.1000 కోట్ల బిజినెస్ చేయనున్నారన్నమాట. ఇప్పటికే మూడు చిత్రాలపై కూడా ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. పవన్, చిరు, చరణ్ భారీ హిట్స్ అందుకుంటారని ఆశిస్తున్నారు. కాబట్టి మౌత్ టాక్ పాజిటివ్ గా ఉంటే తిరుగులేదు. బిజినెస్ కు మించిన వసూళ్లను కలెక్ట్ చేయడం మాత్రం పక్కా.

Tags:    

Similar News