మెగా వర్సెస్‌ మెగా... మెగా ఫ్యాన్స్‌లో టెన్షన్‌

మెగా ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిరంజీవి నటిస్తున్న 'మన శంకరవరప్రసాద్‌ గారు' సినిమా 2026 సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.;

Update: 2025-11-21 07:11 GMT

మెగా ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిరంజీవి నటిస్తున్న 'మన శంకరవరప్రసాద్‌ గారు' సినిమా 2026 సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఇతర హీరోల సినిమాలతో కాస్త పోటీ ఎక్కువగానే ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే 2025 సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఇతర సినిమాలతో కఠినమైన పోటీ ఎదురైనప్పటికీ అనిల్‌ రావిపూడి తన ఎంటర్‌టైన్‌మెంట్‌తో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం విజేతగా నిలవడంతో మిగిలిని సినిమాలు పర్వాలేదు అనిపించుకున్న వసూళ్లు రాబట్టడంలో విఫలం అయ్యాయి. అందుకే 2026 సంక్రాంతికి కూడా మన శంకర వరప్రసాద్‌ గారు పై చేయి సాధిస్తాడు అనే నమ్మకంను మెగా ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.

మన శంకరవర ప్రసాద్‌ గారు వస్తున్నారు...

సంక్రాంతి సీజన్‌ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు, అనిల్‌ రావిపూడి పై నమ్మకం, ఇతర హీరోలతో పోల్చితే చిరంజీవి స్ట్రాంగ్‌ గా ఉండటం వల్ల మన శంకరవరప్రసాద్‌ గారు సినిమా హిట్ కావడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే సమ్మర్‌లో విడుదల కాబోతున్న మెగా హీరోల సినిమాల విషయంలో ఒకింత ఆందోళన కనిపిస్తోంది. 2026 సమ్మర్‌ ను మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ తన పెద్ది సినిమాతో ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. సుకుమార్‌ శిష్యుడు అయిన బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే మార్చి 2026 లో విడుదల కాబోతున్న పెద్ది సినిమా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే సినిమాకు పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయ్యే విధంగా టీజర్‌, పాట వచ్చి ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల వారిని మెప్పించాయి.

సమ్మర్‌లో మెగా హీరోల సినిమాలు...

2026 సమ్మర్‌లోనే ఉప ముఖ్యమంత్రి, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా హరీష్ శంకర్‌ కాంబోలో రూపొందుతున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమా రాబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయింది. తల్చుకుంటే సినిమాను వెంటనే పూర్తి చేసి డిసెంబర్‌ లేదా జనవరిలో విడుదల చేసే అవకాశం ఉంది. కానీ పోటీ ఉన్న కారణంగా సమ్మర్‌ కి నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. ఏప్రిల్‌ నెలలో ఈ సినిమా ఉంటుంది. అంటే పెద్ది వచ్చిన చాలా తక్కువ గ్యాప్‌ లోనే ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమా విడుదల ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. పవన్‌ కళ్యాణ్ కి జోడీగా ఈ సినిమాలో శ్రీలీల నటిస్తున్న విషయం తెల్సిందే. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమా విడుదలైన చాలా తక్కువ గ్యాప్‌లోనే మెగాస్టార్‌ చిరంజీవి నటించిన మరో మూవీ విశ్వంభర విడుదల ఉంటుంది అని మెగా కాంపౌండ్‌ ద్వారా సమాచారం అందుతోంది.

చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, రామ్‌ చరణ్ సినిమాలు...

చిరంజీవి విశ్వంభర సినిమాను మే నెలలో విడుదల చేసి తీరాలని నిర్మాత, దర్శకుడు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. ఆ సినిమా ఏడాది కాలంగా వాయిదా పడుతూ వస్తుంది. కనుక ఇంకా ఆలస్యం చేయకుండా 2026 సమ్మర్‌ లో విడుదల చేయడం కన్ఫర్మ్‌ అంటున్నారు. ఈ సినిమాలు కాకుండా సాయి ధరమ్‌ తేజ్‌ నటిస్తున్న భారీ బడ్జెట్‌ మూవీ సంబరాల ఏటి గట్టు సినిమాను సైతం 2026 సమ్మర్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. 2026 మే నెలలోనే సినిమాను విడుదల చేస్తామని ఆ మధ్య మేకర్స్ చెప్పుకొచ్చారు. అధికారికంగా డేట్‌ రావాల్సి ఉంది. మరో వైపు వరుణ్‌ తేజ్‌ సినిమాను సైతం వచ్చే సమ్మర్‌ కి ప్లాన్‌ చేస్తున్నారు. దాంతో 2026 సమ్మర్‌ మొత్తం మెగా హీరోల సినిమాతో ప్యాక్‌ చేయబడినట్లుగా అవుతుంది. అన్ని సినిమాలకు కావాల్సినంత గ్యాప్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఫ్యాన్స్ మాత్రం ఏ సినిమా ఎలా ఉంటుంది, ఒక మెగా మూవీ మరో మెగా మూవీకి పోటీగా ఏమైనా మారుతుందా అనే టెన్షన్‌లో ఉన్నారు. ఇదే సమయంలో మెగా ఫ్యాన్స్‌లు బ్యాక్ టు బ్యాక్‌ మూవీస్‌ తో ఎంజాయ్‌ చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News