ఆ కిక్కు కోసమే మెగా హీరో వెయిటింగ్..?

వైష్ణవ్ తేజ్ మాత్రం కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నాడు. ఎలాంటి కథకైనా సరిపోయే కటౌట్ వైష్ణవ్ ది.;

Update: 2025-05-27 22:30 GMT

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. బుచ్చి బాబు డైరెక్షన్ లో వచ్చిన ఉప్పెన సినిమాతో 100 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించాడు. ఐతే ఆ సినిమా తర్వాత వరుస ప్రాజెక్ట్ లు చేస్తున్నాడు కానీ ఆశించిన ఫలితాలను మాత్రం అందుకోవట్లేదు. వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం ఇక హిట్టు కథ కోసం వెతుకుతున్నాడని తెలుస్తుంది. ఆదికేశవ ఫ్లాప్ తర్వాత కథల విషయంలో అసలు కాంప్రమైజ్ కాకూడదని అనుకుంటున్నాడట వైష్ణవ్ తేజ్.

మెగా ఫ్యామిలీ హీరో కాబట్టి ఎలాగు కథల వేటలో ఉన్నాడని చాలా మంది యువ దర్శకులు వైష్ణవ్ కి కథలు చెబుతున్నా అందులో ఏ ఒక్కటి కూడా కిక్కు ఇవ్వట్లేదని తెలుస్తుంది. ఈసారి సినిమా అంటే చేస్తే పక్కా ఆడియన్స్ ని అలరించే సినిమా చేయాలనే ఉద్దేశంతోనే వైష్ణవ్ తేజ్ కాస్త టైం తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఓ పక్క తేజ్ కూడా సినిమాల వేగాన్ని తగ్గించాడు. బ్రో తర్వాత ప్రస్తుతం సంబరాల యేటిగట్టు సినిమా చేస్తున్నాడు సాయి ధరం తేజ్.

వైష్ణవ్ తేజ్ మాత్రం కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నాడు. ఎలాంటి కథకైనా సరిపోయే కటౌట్ వైష్ణవ్ ది. ఐతే ప్రస్తుతం యువ హీరోగా లవ్ స్టోరీస్ చేస్తున్నాడు. ఐతే ఈమధ్య యువ హీరోలు కూడా వెరైటీ కథలతో సత్తా చాటుతున్నారు. కాబట్టి వైష్ణవ్ తేజ్ కూడా అలాంటి సినిమాతోనే రావాలని అనుకుంటున్నాడు.

మెగా ఫ్యామిలీ హీరోగా ఫ్యాన్స్ సపోర్ట్ ఉన్నా కూడా సొంత టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు వైష్ణవ్ తేజ్. అందుకే కథల ఎంపికలో తగినంత టైం తీసుకుంటున్నాడు. ఏదో ఒక సినిమా లెక్క కోసం చేసి కెరీర్ రిస్క్ లో పడేసుకోవడం కన్నా సరైన కథతో వచ్చ్చి సూపర్ హిట్ అందుకోవడం బెటర్ అని ఫిక్స్ అయ్యాడు వైష్ణవ్ తేజ్. అందుకే ఆదికేశవ తర్వాత వైష్ణవ్ నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. మరి మెగా హీరోని మెప్పించే కథ ఏది అవుతుంది. ఏ డైరెక్టర్ తో వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ సినిమా చేస్తాడన్నది చూడాలి. తేజ్, వైష్ణవ్ మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు.

Tags:    

Similar News