'మస్సా మస్సా' సాంగ్: కుస్తీ యోధుడి కష్టం అంతా ఇంతా కాదు!
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ `పెద్ది` నుండి విడుదలైన `మస్సా మస్సా` ఆడియో ట్రాక్ ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది.
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ `పెద్ది` నుండి విడుదలైన `మస్సా మస్సా` ఆడియో ట్రాక్ ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ ఇన్‌స్పిరేషనల్ సాంగ్‌కు ప్రముఖ రచయిత అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా, విశాల్ మిశ్రా తన గాత్రంతో ప్రాణం పోశారు. ఆడియో పరంగా ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ఈ పాట వీడియో కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ తాజాగా ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు.
ఈ రోజు మేకర్స్ అధికారికంగా `మస్సా మస్సా` పూర్తి వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ వీడియోలో రామ్ చరణ్ ఇంటెన్స్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ .. ఒక ప్రొఫెషనల్ రెజ్లర్ (కుస్తీ యోధుడు) పాత్ర కోసం పడ్డ కష్టం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. హాలీవుడ్ స్థాయిలో ఉన్న అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పాత్రలో పర్‌ఫెక్షన్ సాధించడం కోసం రామ్ చరణ్ ఎండను సైతం లెక్కచేయకుండా గంటల తరబడి మైదానంలో శ్రమించిన వైనం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ ప్రతిష్టాత్మక వీడియో సాంగ్ ను విజయవాడలో అత్యంత వైభవంగా నిర్వహించిన `పెద్ది` ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర బృందం సమక్షంలో లాంచ్ చేశారు. బెజవాడ ఈవెంట్‌లో ఈ విజువల్స్ చూసిన మెగా అభిమానుల కోలాహలంతో థియేటర్ల స్థాయి హంగామా కనిపించింది. `ఉప్పెన` ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రంపై ఈ ఒక్క పాటతో అంచనాలు మరింత ఆకాశాన్ని తాకాయి.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు అత్యంత భారీ బడ్జెట్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, బోమన్ ఇరానీ వంటి అగ్ర నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రెహమాన్ సంగీతం, బుచ్చిబాబు టేకింగ్, చరణ్ రెజ్లర్ మేకోవర్ అన్నీ కలిసి `పెద్ది` సినిమాను బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త రికార్డుల వేటకు సిద్ధం చేసాయని చెప్పొచ్చు.