మాస్ జాతర ఆలస్యంపై రవితేజ రియాక్షన్!

లైఫ్ లో ఏం జరిగినా అంతా మన మంచికే అని ముందుకు వెళ్లాలి. అందుకే ఎప్పుడు నిరాశ పడకూడదు.. ఒక సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అని నేను అస్సలు పట్టించుకోను.;

Update: 2025-10-30 12:36 GMT

మాస్ మహారాజా పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చే ఒకే ఒక్క పేరు రవితేజ.. సినిమాల్లోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలలో ఈయన కూడా ఒకరు.. చిరంజీవి తర్వాత బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన వారిలో రవితేజ ఒకరని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి రవితేజ మరికొద్ది గంటల్లో మాస్ జాతర మూవీ తో మనల్ని అలరించబోతున్నారు. అయితే మాస్ జాతర మూవీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే రవితేజ పలు ఇంటర్వ్యూలలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవితేజ తన రిటైర్మెంట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి రవితేజ రిటైర్మెంట్ పై చేసిన కామెంట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..

రవితేజ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "మెగాస్టార్ చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీ కి వచ్చాను.. సినిమాల్లో రిటైర్మెంట్ అంటూ తీసుకోను.. నేను చచ్చే వరకు నా శ్వాస ఆగే వరకు సినిమాల్లోనే కొనసాగుతా.. ఇక నా కెరియర్ లో ఒక సినిమా మొదలుపెట్టాక ఇన్నిసార్లు వాయిదా వేస్తూ ఇన్ని రోజుల సమయం తీసుకుంది ఒక్క మాస్ జాతర మూవీకి మాత్రమే.అయితే ఈ సినిమా ఎన్నోసార్లు వాయిదా పడింది. దానికి కారణం షూటింగ్ సమయంలో నాకు గాయాలు అవ్వడమే.. గాయాల వల్ల చాలా రోజులు షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమా సంక్రాంతికి అనుకున్నాం. కానీ అప్పుడు రాలేదు. ఆ తర్వాత సమ్మర్, వినాయక చవితి ఇలా ఎన్నో డేట్స్ అనుకున్నాం. కానీ చివరికి ఇప్పుడు వస్తుంది.

లైఫ్ లో ఏం జరిగినా అంతా మన మంచికే అని ముందుకు వెళ్లాలి. అందుకే ఎప్పుడు నిరాశ పడకూడదు.. ఒక సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అని నేను అస్సలు పట్టించుకోను. రిజల్ట్ ఏం వచ్చిన సరే సినిమాలు చేసుకుంటూ నా పని నేను చూసుకుంటా.. ప్రతి ఒక్కరికి నేను ఇవ్వాలనుకున్న సలహా ఒక్కటే.. అదే ఆత్మవిశ్వాసం.. మనపై మనకు నమ్మకం ఉండాలి.అలాంటప్పుడే ఏదైనా సాధించగలం. మనం కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా ఫలితం ఏదో ఒక రోజు అదే వస్తుంది. ఆ సమయంలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతే ఏ పని చేయలేం. అందుకే మొదట మన మీద మనం పూర్తి నమ్మకం పెట్టుకోవాలి. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ ని,విమర్శలని నేను అస్సలు పట్టించుకోను. అందుకే ఆ ట్రోల్స్ నన్ను ఎక్కువగా ప్రభావితం చేయవు.. అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రవితేజ.

ప్రస్తుతం రవితేజ చేసిన కామెంట్స్ అభిమానులకి కొత్త ఊపునిస్తున్నాయి. రవితేజ కి సినిమాలు అంటే ఎంత పిచ్చో ఆయన ఇచ్చిన ఒక్క స్టేట్మెంట్ తో అర్థం చేసుకోవచ్చు అని రవితేజ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇక మాస్ జాతర మూవీ విషయానికి వస్తే.. రవితేజ, శ్రీలీల హీరో హీరోయిన్లుగా భాను భోగవరపు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీకి నాగ వంశీ నిర్మాతగా చేశారు. ఈ మూవీ అక్టోబర్ 31న గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

Tags:    

Similar News